అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహించాలని 1994లో ఐక్య రాజ్య సమితి ప్రకటించింది. ఆదివాసీ అంటే “అసలు నివాసులు.
ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఆగస్టు 9న ‘ఆదివాసీ గౌరవ్ పర్వ్’గా జరుపుకోవాలని, ఆదివాసీల హక్కులను కాలరాయడంపై చేస్తున్న పోరాటంలో గిరిజనులకు మద్దతు తెలియజేయాలని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తన రాష్ట్ర యూనిట్లను కోరింది.
NDA ప్రభుత్వ హయాంలో గత 9 ఏండ్లుగా ఆదివాసీ సోదర సోదరీమణుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడంతో పాటు సుస్థిరమైన ప్రపంచానికి టార్చ్ బేరర్లుగా వారి పాత్రను ప్రశంసించే అవకాశంగా ఈ కార్యక్రమం జరగాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది . దీనిపై దేశంలోని అన్ని కాంగ్రెస్ రాష్ట్ర విభాగాలకు ఒక సందేశంలో AICC ప్రధాన కార్యదర్శి KC వేణుగోపాల్ తెలిపారు .