Amaravathi: చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించిన CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, చట్ట విరుద్ధం:
గవర్నర్ అనుమతి లేకుండా అరెస్టు చేయడం చట్టవిరుద్ధం
అవినీతి నిరోధక చట్టం ప్రకారం దర్యాప్తు చేసేందుకు..
గవర్నర్ అనుమతి తప్పనిసరి:
గవర్నర్ అనుమతి విషయంలో స్పష్టత కరువైంది: నాగేశ్వరరావు
గవర్నర్ అనుమతి తీసుకోకపోయినా, ఇవ్వకపోయినా..
దర్యాప్తు చెల్లుబాటు కాదన్న CBI మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
***
కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారు … ప్రజలకు ఆయన సేవ చేస్తారు … మాజీ మంత్రి ఆనం
విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న నారా భువనేశ్వరి
బాధలు చెప్పుకునేందుకే దుర్గమ్మను దర్శించా!
నా భర్తను కాపాడమని దుర్గమ్మను కోరుకున్నా
నా భర్త ప్రజల కోసమే పోరాడుతున్నారు
నా భర్త చేస్తున్న పోరాటం విజయం సాధిస్తుంది
చంద్రబాబు పోరాటానికి ప్రజలు మద్దతు ఇవ్వాలి! నారా భువనేశ్వరి
***
పొదలాడ నుంచి విజయవాడ బయల్దేరిన లోకేశ్
యువగళం క్యాంప్ నుంచి విజయవాడ బయల్దేరిన నారా లోకేశ్
దాదాపు 5 గంటలపాటు ఎండలోనే రోడ్డుపై బైఠాయించి నిరసన తండ్రిని చూసేందుకు అనుమతించాలని నిరసన
పోలీసులు అనుమతించడంతో విజయవాడ బయల్దేరిన లోకేశ్
***
చంద్రబాబు అరెస్ట్‌ను ఖండించిన జనసేన అధినేత పవన్
ఏ తప్పూ చేయని నాయకులను జైల్లో పెట్టి వేధిస్తున్నారు
రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి పట్ల పోలీసుల తీరు దారుణం
ఇలాంటి చర్యలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోంది: పవన్
ప్రాథమిక ఆధారాలు చూపకుండా అరెస్ట్ చేయడం సరికాదు
లా అండ్ ఆర్డర్‌ను కాపాడాల్సింది పోలీసులే కదా?: పవన్
లా అండ్ ఆర్డర్ విషయంలో వైసీపీకి సంబంధమేంటి?: పవన్
అరాచకాలు జరుగుతున్నది వైసీపీ వల్లే కదా?: పవన్
నాయకుడు అరెస్టైతే.. అభిమానులు రోడ్లపైకి వస్తారు: పవన్
నాయకుడికి మద్దతుగా రావడం ప్రజాస్వామ్యంలో భాగమే
ఇళ్లలో నుంచి బయటకు రాకూడదంటే ఎలా?: పవన్
మీ నాయకులు అక్రమాలు, దోపిడీ చేసినా విదేశాలకు వెళ్లొచ్చు
ఒక నాయకుడు అరెస్టైతే కార్యకర్తలు బయటకురావొద్దా?
###
ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది: రాఘవేంద్రరావు
విజనరీ లీడర్ చంద్రబాబు అరెస్ట్ తీరు అప్రజాస్వామికం