కానిస్టేబుల్ సాహసం.. నిలిచిన యువకుడి ప్రాణం
2 కి.మీ భుజాన వేసుకుని.. పరుగో పరుగు
శబాష్ పోలీసన్నా అంటూ.. నెటిజన్లు సెల్యూట్
చనిపోతున్న వ్యక్తిని తన భుజంపై మోసుకుని తీసుకెళ్ళి మరీ ,అతని ప్రాణాలు కాపాడాడు , కరీంనగర్‌లోని ఓ కానిస్టేబుల్. పురుగుల మందు తాగాడు కాపాడండి ,అని సమాచారం అందుకున్న ,కానిస్టేబుల్ రెండు కిలోమీటర్లు పొలాల గట్టు మీద నడిచి,పక్కనే ఉన్న ఊరికి చేరుకుని ,పురుగుల మందు తాగిన అతనిని ,హాస్పిటల్ లో జాయిన్ చేశారు ,పోలీస్ కానిస్టేబుల్ జయపాల్ .దారి దోపిడీ దొంగలను నుంచి ప్రజలను రక్షించటమే కాదు ,ఏమి తెలియని అమాయకాపు ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత కూడా పోలీసుల భుజాల మీద ఉంటుంది, అని నిరూపించారు కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్ . చాలా మంది పోలీసులు ఎంతో నీతి నిజాయితీతో, అంకిత భావంతో ప్రజలకు సేవలు అందిస్తూ ఉంటారు.అలాగే మరి కొంతమంది పోలీసు వారు వారి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా, చావుబ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న ఎందరో పేదవారిని కాపాడి ,పునర్ జీవితాన్ని ఇచ్చి వారి సహృదయాన్ని చాటుకుంటారు, ఆ కోవకు చెందిన వారే కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్.
ఇంతకు ముందు కూడా సడెన్‌గా హార్ట్ ఎటాక్ బారిన పడిన వారికి , సీఆర్ చేసి కాపాడిన పోలీస్ వారిని కూడా చూసాము .ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోతున్న కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్ కూడా అలాంటి పనే చేశారు. తాను చేసే పొలిసు ఉద్యోగానికి నూటికి నూరు శాతం న్యాయం చేశారు కరీంనగర్ కానిస్టేబుల్ జయపాల్. సమయస్ఫూర్తి, మానవతా దృక్పధం తో పురుగులమందు తాగిన ఓక వ్యక్తి నిండు ప్రాణాన్ని కాపాడారు.కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లోని భేతిగల్ గ్రామానికి చెందిన కుర్ర సురేష్ అనే ఆతను ఇంట్లో గొడవ పడి పొలం దగ్గరకు వచ్చి పురుగుల మందు తాగాడు. అక్కడే ఆ చుట్టు ప్రక్కల ఉన్నవారు అది చూసి డయల్ 100కు ఫోన్ చేసి చెప్పారు . వెంటనే స్పందించిన బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్, హోమ్‌గార్డు కిన్నెర సంపత్ అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు. అప్పటికే కుర్ర సురేష్ అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.
ఒక్క నిముషం కూడా ఆలోచించకుండా కానిస్టేబుల్ జయపాల్ సురేష్‌ను భుజం మీద వేసుకుని పొలం గట్లమీద ఊర్లోకి పరుగులు పెట్టాడు .రెండు కిలోమీటర్లు నడిచి సమయానికి కొన ఊపిరితో ఉన్న అతనిని జమ్మగుంట ప్రభుత్వాసుపత్రిలో సురేష్‌ను జాయిన్ చేశారు కానిస్టేబుల్ జయపాల్. పురుగులు మందు తాగిన కుర్ర సురేష్ ఆరోగ్యం ఇప్పుడు కుదుట పడింది సరి అయిన సమయానికి హాస్పిటల్కు తీసుకురావడం వల్లే పేషేంట్ ప్రాణాలను కాపాడాము అని డాక్టర్లు తెలిపారు .
ప్రశంసల జల్లు ……..
అతని పునర్జన్మకు కారణమైన కానిస్టేబుల్ జయపాల్‌కు సురేష్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ జయపాల్ , హోమ్‌గార్డు కిన్నెర సంపత్ ,ఇతర సిబ్బందిని పోలీస్ ఉన్నతాధికారులు, అభినందించారు. ఒక నిండు ప్రాణాన్ని కాపాడి పునర్ జన్మ నిచ్చిన కరీం నగర్ కానిస్టేబుల్ జయపాల్ పై నెటిజన్లు ప్రశంసల వర్షంకురిపిస్తున్నారు