ఉదయం ఫిల్మ్ ఛాంబర్‌లో తెలుగు Film Chamber elections కు గాను వోటింగ్ ప్రారంభమయుంది . ఈసారి సినీ దిగ్గజాలు రంగం లోకి దిగారు . మధ్యాహ్నం 3 గంటల వరకూ పోలింగ్ జరిగింది . ప్రొడ్యూసర్ సెక్టార్ , స్టూడియో సెక్టార్ , డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ లతో పాటు ఎక్సిభిటర్ సెక్టార్ ల నుంచీ EC , సెక్టార్ సభ్యులను ఎన్నుకోవడం జరుగుతుంది .
ముఖ్యంగా చిన్న సినిమాల మనుగడ, డిజిటల్ సర్వీసు ప్రొవైడర్ల ఛార్జీ తగ్గింపు హామీలతో సి.కల్యాణ్ ప్యానెల్ బరిలో నిలిచింది . ఇక దిల్ రాజు ప్యానెల్ ఫిల్మ్ ఛాంబర్ మనుగడ, భవిష్యత్ తరాలకు మంచి సినీ పరిశ్రమను అందిద్దామనే కాంక్షతో బరిలో దిగారు . రెండు పానెల్స్ లో హేమాహేమీలు పోటీ చేసా రు . అతి తక్కువ ఓట్లు స్టూడియో సెక్టార్ లో అంటే 98 మంది మాత్రమే వున్నారు . ఇక్కడ అన్నపూర్ణ అధినేత సుప్రియ అత్యధిక ఓట్లు సాధించారు .
ప్రస్తుత చైర్మన్ బసిరెడ్డి నేటితో ముగియనుంది . ప్రొడ్యూసర్ సెక్టార్ నుంచీ 1500 వరకూ ఓటర్లు వున్నారు .
ప్రొడ్యూసర్ సెక్టార్ నుండీ దిల్ రాజు , సి కళ్యాణ్ , తుమ్మలపల్లి రామసత్యనారాయణ (సెక్టార్ ) , ప్రసన్నకుమార్ , వై వి చౌదరి , అశోక్ కుమార్ , మోహన్ వడ్లపట్ల, దామోదర ప్రసాద్ తదితరులు ఉన్నట్లు తెలుస్తోంది . TFCC నూతన అధ్యక్షుడుగా దిల్ రాజు పదవీకాలం 2 ఏళ్ళు . కాగా దామోదర ప్రసాద్ సెక్రటరీ గా , ఉపాధ్యక్షుడిగా ముత్యాల రామరాజు , కోశాధికారిగా ప్రసన్నకుమార్ వ్యవహరిస్తారు .