ఆంధ్ర ప్రదేశ్ లో 35 సర్పంచ్ 245 పంచాయతీ వార్డులకు ఉప ఎన్నికలు జరిగాయి . ఈ ఎన్నికలు నువ్వా నేనా అనే రీతిలో జరిగాయి . తెదేపా అధికార వైకాపా తో పోటా పోటీగా తలపడింది . అధికార యంత్రాంగం , పోలీసు , అధికార దుర్వినియోగం ఇలా అనేక ఒత్తిడులను ప్రతిపక్ష అభ్యర్థులు ఎదుర్కొన్నారు . ఈ ఎన్నికల్లో కొన్ని చోట్ల జనసేన మద్దతుదారులు సర్పంచ్ , వార్డ్ మెంబెర్ లు గా గెలవడం విశేషం . ఈ ఎన్నికల్లో తెదేపా తన సత్తా చాటిందనే చెప్పాలి . మెజారిటీ స్థానాల్లో తెదేపా సానుభూతిపరులు విజయం సాధించారు .
- పశ్చిమ గోదావరి జిల్లా:
- ఉండ్రాజవరం మండలం దన్నేరు లో వార్డు లో తెదేపా బలపరిచిన మట్టపర్తి అచ్యుతరామయ్య 27 ఓట్ల తేడా తో గెలుపొందారు .
- కొవ్వూరు మండలం 8 వ వార్డులో జనసేన బలపరిచిన నాగమణి 31 ఓట్ల తేడాతో గెలుపొందారు
- వైస్సార్ జిల్లా :
- ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ లో 13 వార్డులో ఇద్దరు వైకాపా మద్దతుదారులు పోటీ కి దిగారు . సర్పంచ్ బలపరిచిన హర్షవర్ధన్ రెడ్డి 48 ఓట్ల తేడాతో MLA బలపరిచిన బ్రహ్మానంద రెడ్డి పై గెలుపొందారు .
- రాజుపాలెం 9 వార్డు లో తెదేపా సానుభూతిపరుడు ఓబులేసు 42 ఓట్ల తేడా తో గెలుపొందారు .
- గుంటూరు జిల్లా :
- తెనాలి మండలం బుర్రిపాలెం గ్రామా సర్పంచ్ గా తెదేపా బలపరిచిన పరుచూరి విజయ లక్ష్మి 1526 ఓట్ల మెజారిటీ తో గెలుపొందారు .
- హాఫ్ పేట 7 వార్డులో తెదేపా బలపరిచిన శివానందం విజయం సాధించారు
- నంద్యాల జిల్లా : పంజాముల మండలం ఆకుమళ్ళ లో తెదేపా అభ్యర్థి లత గెలుపు
- Satyasai Jilla లో 13 వార్డులకు ఎన్నికలు జరుగగా 7 తెదేపా 6 వైకాపా
- చిత్తూరు జిల్లా లో 7 వార్డులకు ఎన్నికలు జరుగగా 4 తేదెపా 3 వైకాపా