తెలంగాణ లో కాషాయ జెండా ఎగురవేస్తాం అని కమలనాధులు గొప్పగా చెప్పేవారు . దీనికి కారణం 2019 లోకసభా ఎన్నికల్లో భాజాపా కు 4 ఎంపీ సీట్లు , 19% ఓట్లు రావడమే . ఇక 21 అసెంబ్లీ స్థానాల్లో మొదటి స్థానం లోను 22 అసెంబ్లీ స్థానాల్లో 2 వ స్థానం లోవచ్చారు . ఇక కేంద్రం లో భాజాపా అప్రహిత మెజారిటీ అంటే 303 స్థానాలు సాధించింది . గోల్కొండ కోటలో కాషాయం ఎగరాలి అనే లక్ష్యానికి తగ్గట్టుగానే బండి సంజయ్ ను 2020 మార్చ్ లో అధ్యక్షుడిగా చేసారు .
బండి సంజయ్ నేతృత్వం లో భాజపా ఉపఎన్నికలు రెండింటిలో విజయం సాధించింది . అదే దుబ్బాక , హుజూర్ నగర్ . ఇక ప్రతిష్ఠమకమైన GHMC పరిధిలో 48 కార్పొరేటర్ స్థానాలు సాధించి అధికార భారాసా కు ముచ్చెమటలు పట్టించారు . ఇక్కడ వరకూ కధ బాగానే వుంది .
అసలు ఆట :
మొదటి సెల్ఫ్ గోల్ : రాష్ట్ర నాయకులకు తెలియకుండా మొయినాబాద్ ఫార్మ్ హౌస్ లో స్వామీజీ ల mla ల కొనుగోలు . 7 July 2022 తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు చేసిన ఫిర్యాదులో, బిజెపిలోకి మారడానికి ద్రవ్య ప్రయోజనాల కోసం తనకు కేంద్ర ప్రభుత్వ సివిల్ కాంట్రాక్ట్ పనులు మరియు ఇతర ప్రముఖ పదవులతో పాటు రూ.100 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలిపారు. బీజేపీలో చేరకుంటే క్రిమినల్ కేసులు, ఈడీ, సీబీఐ దాడులు చేస్తామని పరోక్షంగా హెచ్చరించారని ఆరోపించారు.
రెండవ సెల్ఫ్ గోల్ : 23 August 2022: భాజాపా నుంచీ రాజా సింగ్ బహిష్కరణ చేస్తూ షోకాజ్ నోటీసు ఇచ్చారు . రాజా సింగ్ MLA మరియు భాజాపా కు శాసన సభలో ఫ్లోర్ లీడర్ . రాజా సింగ్ తాను చేసిన వీడియోలో ఏ మతాన్ని కించపరచలేదని లేదా ఏ మతానికి చెందిన దేవుళ్లను విమర్శించలేదని పేర్కొన్నారు . ”నేను దూషణ లేదా కఠినమైన పదజాలం ఉపయోగించలేదు. నేను నా వీడియోలో ఏ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. నేను ఉద్దేశపూర్వకంగా ఏ మతం మనోభావాలను దెబ్బతీయలేదు,” అని ఆయన అన్నారు. నేటి వరకూ రాజా సింగ్ పై సస్పెన్షన్ ఎత్తి వేయలేదు .
మూడవ సెల్ఫ్ గోల్ : ప్రతికూల పరిస్థితులలో మునుగోడు ఉప ఎన్నికలకు వెళ్లడం :Munugodu Byelection Gazette Notification – October 7, 2022 ఫార్మ్ హౌస్ లో mla ల కొనుగోలు వ్యవహారం వివిధ కోర్టులలో నలుగుతోంది . మునుగోడు ఉప ఎన్నిక లో మాజీ కాంగ్రెస్ MLA కోమటిరెడ్డి రాజగోపాల రెడ్డి బరిలోకి దిగారు . 10 వేలకు పైగా మెజారిటీ తో భారాసా ఇక్కడ భాజాపా అభ్యర్థి గా బరిలోకి దిగిన బలమైన రాజగోపాల రెడ్డి ని ఓడించింది . ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కి 23 వేల ఓట్లు రావడం జరిగింది . ఓట్ల పోలరైజషన్ ను ఇక్కడ కాంగ్రెస్ నిలువరించడం తో భాజపా చతికిల పడింది .
నాల్గొవ సెల్ఫ్ గోల్ : ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లో నాయకత్వ పగ్గాల కోసం మొదలైన అంతర్గత పోరు. పార్టీ లో బండి సంజయ్ ఎదుగుదలను జీర్ణించుకోలేని వైనం . పడే పడే భాజాపా అగ్ర నాయకత్వం బండి సంజయ్ ను మార్చేది లేదు అని చెప్పినా .. ఆగని నాయకత్వ మార్పు ప్రచారం . ప్రచారాలకు తలవొగ్గి , ఎన్నికల యుద్దానికి శ్రేణులను సిద్ధం చేయాల్సిన తరుణం లో నాయకత్వ మార్పు .
ఐదవ సెల్ఫ్ గోల్ : ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై భాజాపా అత్యుత్సాహం . మొదట ఈ వ్యవహారం పై ఢిల్లీ భాజాపా ఎంపీ మాట్లాడారు . తర్వాత అనేక అరెస్టులు అధికారులు , ఎంపీ కుమారుడు , ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇలా అనేకమంది అరెస్టు అయ్యారు . ఇదిగో కవిత అరెస్ట్ , అదిగో అరెస్ట్ అంటూ భాజాపా నాయకులు ఢిల్లీ నుంచీ గల్లీ వరకు చేసిన హడావుడి . కేవలం విచారణ తో సరిపెట్టిన వైనం … తేర వెనుక ఏదో జరిగిందనే విమర్శలు పార్టీ నాయకులే చేయడం … ఇక ప్రజలు ఏ విధం గా మాట్లాడుకొంటారనేది తెలిసిందే కదా .
ఆరవ సెల్ఫ్ గోల్ : ఆంధ్ర ప్రదేశ్ లో జనసేన తో కేవలం ఫోటోల వరకే పరిమితమైన పొత్తు …తెలంగాణ లో GHMC ఎన్నికల్లో కనీసం జనసేనాని అడిగినా కనీసం ఒక్క కార్పొరేషన్ వార్డు లో సైతం చోటు పెట్టని మొండి వైఖరి . కర్ణాటక ఎన్నికల్లో గాని , MLC ఎన్నికల్లో కానీ జనసేన సహాయాన్ని కోరని వైఖరి . MLC ఎన్నికల్లో జనసేన భారాసా అభ్యర్థి కి మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే కదా …పార్టీని విమర్శించిన చాలామంది నాయకులను వదిలి , కేవలం తెలంగాణ ఉద్యమ కారుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి పైన మాత్రమే సస్పెండ్ వేటు వెయ్యడం ..
భారాసా కు తామే ప్రత్యామ్నాయం అని.. కాస్త కష్టపడితే చాలు అధికారంలో వచ్చేస్తామని ధీమా గా తెలంగాణ కమల దళం ఉండేది . కానీ అందరి అంచనాలను వారే, అదే బీజేపీ నేతలే తలకిందులు చేస్తూ సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. అధికారం సంగతి పక్కన పెట్టి , కనీసం ప్రతిపక్షంలో కూడా ఉంటారో లేదో తెలియని పరిస్థితిలో ఇప్పుడు బీజేపీ ఉంది. కర్ణాటక ఎన్నికల తదుపరి కొత్త నాయకులను ఆకర్షించలేక తెలంగాణా భాజపా చతికిల పడిందనే చెప్పాలి . ప్రస్తుతం బీజేపీలో ఉన్న చాలా మంది నేతలు పక్క చూపులు చూస్తున్నారు. ఇక సౌమ్యుడు కిషన్ రెడ్డి నాయకత్వం లో ఇప్పుడున్న పరిస్థితులలో ghmc పరిధిలో 12 నుంచీ 15 స్థానాల్లోనూ , తెలంగాణ జిల్లాల్లో 10 స్థానాల్లోనూ మాత్రమే భాజపా బలమైన పోటీ ఇవ్వగల స్థితి లో ఉందనేది రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది .