తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త 11,062 పోస్టుల భర్తీకి మెగా DSC నోటిఫికేషన్ రిలీజ్
తెలంగాణ మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను కాంగ్రెస్ సర్కారు విడుదల చేసింది. డీఎస్సీ నోటిఫికేషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం విడుదల చేశారు.11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. పాత పోస్టులకు మరిన్ని పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ఈ పోస్టులలో గత ప్రభుత్వం నోటిఫై చేసిన 5,089 ఖాళీలు కూడా ఉన్నాయి. వాటితో పాటు కొత్తగా 5,973 పోస్టులను కాంగ్రెస్ ప్రభుత్వం యాడ్ చేసారు ,మార్చి 1 లేదా 4 నుంచి ఏప్రిల్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనున్నారు. ఆన్ లైన్ లో డీఎస్సీ ఎగ్జామ్‌ను నిర్వహించనున్నారు. దరఖాస్తు ఫీజును రూ.1000గా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 సిటీల్లో ఆన్ లైన్ విధానంలో పరీక్షలు చేపట్టనున్నారు . దీనికి సంబంధించిన ఆప్ డేట్స్‌ను ప్రభుత్వం త్వరలో ప్రకటించాల్సి ఉంది .
రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది.11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. నిన్న పాత నోటిఫికేషన్‌ను సీఎం రేవంత్ రిలీజ్ చేసిన విషయం విదితమే . తాజాగా 11,062 ఖాళీలతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు , 2,629 స్కూల్ అసిస్టెంట్లు , 727 లాంగ్వేజ్ పండిట్లు , 182 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ , 1,016 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు , 79 SA క్యాడర్ కింద 220 పోస్టులు ఖాళీలు ఉన్నాయి .మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులతో కలిసి నోటిఫికేషన్ విడుదల చేసారు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి .
గత ప్రభుత్వం లో డీఎస్సీకి 1.77 లక్షల మంది అభ్యర్థుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఇంతకుముందు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులందరికీ తాజా నోటిఫికేషన్‌లో వారి దరఖాస్తులు అటోమేటిక్‌గా నమోదు అవుతాయి . వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవలసిన అవసరం లేదు. కంప్యూటర్ పద్ధతిలో జరిగే రిక్రూట్‌మెంట్ పరీక్షలు మే లేదా జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి సిద్ధముగా ఉండండి అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, విద్యాశాఖ అధికారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు .