Thursday, September 19, 2024
spot_img
HomeNewsఉమ్మడి పాలమూరు జిల్లా పై కాంగ్రెస్ దృష్టి ... 31న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ..

ఉమ్మడి పాలమూరు జిల్లా పై కాంగ్రెస్ దృష్టి … 31న కొల్లాపూర్‌లో భారీ బహిరంగ సభ..

Hyderabad: తెలంగాణ లో ఎన్నికల రణం మొదలైంది . తెలంగాణా కాంగ్రెస్ ఇప్పుడు కాక ఇంకెప్పుడు అన్న రీతిలో పోరాటానికి సిద్ధమైంది . నేడో రేపో కాంగ్రెస్ అభ్యర్థుల రెండవ జాబితా రానుంది . పాలమూరు ప్రజాభేరి పేరుతొ భారీ బహిరంగ సభను ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ లో ఈ నెల 31 న జరపనుంది . 31న సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ బహిరంగ సభలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు.

ఉమ్మడి పాలమూరు జిల్లా లో 14 శాసన సభా స్థానాలు ఉండగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానం లో భారాసా 13 స్థానాల్లో గెలుపొందింది . కాగా గత 2019 లోకసభా ఎన్నికల్లో మహబూబ్ నగర్ , మక్తల్ స్థానాల పరిధిలో భాజాపా కు ఆధిక్యత లభించింది .

ఇక్కడ భాజాపాకు పెద్ద దిక్కుగా మాజీ మంత్రి డీకే . అరుణ , మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వున్నారు . మహబూబ్ నగర్ మాజీ శాసనసభ్యుడు యెన్నం శ్రీనివాస రెడ్డి రాక తో కాంగ్రెస్ ఈ స్థానం లో బలపడిందని చెప్పాలి . ఇక కొల్లాపూర్‌ లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ తరపున బరిలో వున్నారు .. మొదటి విడత కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాలో కొడంగల్ : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి .. గద్వాల్ నుంచీ బరిలోకి జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య …

అలంపూర్ (SC ) స్థానం నుంచీ మాజీ శాసనసభ్యుడు సంపత్ కుమార్ .. నాగర్ కర్నూల్ నుంచీ కూచుకుల్ల రాజేష్ రెడ్డి .. అచ్చంపేట SC స్థానం Dr చిక్కుడు వంశీ కృష్ణ … కల్వకుర్తి లో mlc కసిరెడ్డి నారాయణ రెడ్డి , షాద్ నగర్ నుంచీ కే శంకరయ్య లకు ఇప్పటికే తీసీక్కెట్లు ఖరారై ప్రచార పర్వం లో వున్నారు . దేనితో కాంగ్రెస్ పార్టీ జిల్లాలో 14 స్థానాలకుగాను 8 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది .

ప్రకటించిన 8 స్థానాల్లో 4 స్థానాల్లో కొడంగల్ , గద్వాల్ , కల్వకుర్తి , కొల్లాపూర్ కాంగ్రెస్ ముందంజలో వుంది . మిగిలిన స్థానాల్లో తీవ్రమైన పోటీ ని ఇస్తోంది . దక్షిణ తెలంగాణ జిల్లాలైన ఖమ్మం , నల్గొండ లలో పట్టు సాధించిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సొంత జిల్లా లో గత వైభవం కోసం , పట్టుకోసం తీవ్ర ప్రయత్నాలు మొదలు పెట్టింది . ఇందులో భాగం గానే ప్రియాంక గాంధీ పాలమూరు ప్రజాభేరి సభ జరగనుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments