బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందు కున్నాయి. ఇక భారాసా లో భవిష్యత్తు కష్టం అనుకొన్న నేతలు కారు దిగి హస్తం అందుకోడానికి సిద్ధమవుతున్నారు . 2002 లో తెదేపా తరపున గెలిచి హైదరాబాద్ మేయర్ గా పని చేశారు .
huda కు తీగల కృష్ణారెడ్డి చైర్మన్ చేశారు . 2009 లో తెదేపా తరపున ఒడి , 2014 లో mla గా గెలిచారు . సైకిల్ దిగి అక్టోబర్ 2014 లో కారు ఎక్కారు . 2018 లో మహేశ్వరం నుచీ తెరాసా అభ్యర్థి గా పోటీ చేసి సబితా ఇంద్ర రెడ్డి పై ఓడిపోయారు .
రంగారెడ్డి జిల్లా లో మారిన రాజకీయ పరిస్థుతులలో బీఆర్ఎస్ పార్టీ లో ఉక్కపోతకు గత కొద్దీ కాలం గా గురౌతున్నారు . మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పువడం దాదాపు ఖరారు అయుండనే చెప్పాలి . ఆయన తన కోడలు మరియు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ కూడా ఆయన అనితారెడ్డితో కలిసి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకొన్నారు . కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో తీగల కృష్ణారెడ్డి మంగళవారం సమావేశమయ్యారు.
ఈ పరిణామం తో భారాసా కు రంగారెడ్డి జిల్లాలో ఎదురు దెబ్బ తగిలిందనే వార్తలు విన వస్తున్నాయి