Amaravati: HighCourt: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట లభించింది. అర్నేష్ కుమార్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. గన్నవరం నియోజకవర్గంలోని ఆత్కూర్ పోలీస్ స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని అయ్యన్నపాత్రుడు హైకోర్టును ఆశ్రయించారు. సీఎం జగన్, ఇతర ప్రజా ప్రతినిధులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఎమ్మెల్యే పేర్ని నాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. HighCourt rejected to give interim Order
Sept. 1-2023: TDP Leader Ayyanna : మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును పోలీసులు విశాఖపట్నంలో అరెస్ట్ చేశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో భాగంగా ఇటీవల ఎన్టీఆర్ జిల్లా గన్నవరంలో సభ నిర్వహించారు. ఈ సభలో చేసిన వ్యాఖ్యలపై అయ్యన్న సహా పలువురిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులోనే అయ్యన్నను కృష్ణా జిల్లా పోలీసులు విశాఖ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.
అయితే మాజీమంత్రి అయ్యన్నపాత్రుడుకు 41 A నోటీసులు ఇచ్చిన కృష్ణా జిల్లా పోలీసులు.. అనకాపల్లి జిల్లా వెంపడు టోల్ గేట్ వద్ద వదిలేసినట్లు తెలుస్తోంది.