ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పొత్తుల దిశగా ప్రయాణం చేస్తున్నాయి . ఇటీవల షర్మిలారెడ్డి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ లను కలసిన విషయం విదితమే . ఆమె స్థాపించిన YSRCTP ని నడపలేక ఒకప్పుడు తాము విమర్శించిన కాంగ్రెస్ నే తిరిగి ఆశ్రయుంచడం లో పలు రాజకీయ కోణాలు ఆవిష్కృతమవుతున్నాయి .
ఆంధ్ర ప్రదేశ్ లో వైస్ జగన్ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి రాబోయే రోజుల్లో కేంద్రం లో వారు (ఇండియా కూటమి ) కలలు కంటున్న సంకీర్ణ ప్రభుత్వం లో ysrctp కూడా భాగస్వామి అయ్యే విధం గా లోపాయికారీ ఒప్పందాలు జరుగు తున్నాయని ఒక ప్రముఖ సంపాదకుడు తన కామెంట్స్ ద్వారా చెప్పడం జరిగింది . దీనితో కేంద్ర భాజాపా నాయకుల్లో వైస్ జగన్ రాజకీయ అడుగులపై వివిధ అనుమానాలు మొదలయ్యాయి . 4 1/2 సంవత్సరాల కాలం నిరాఘాటం గా జరిగిన వీరి రహస్య అనుబంధానికి చివరి రోజులు దగ్గర పడ్డాయి .
జనసేనాని వైసీపీ విముక్త ఆంధ్ర ప్రదేశ్ ను చూడాలని , దానికోసం పొత్తులకు సిద్ధమని పలు సందర్భాలలో ఖరాఖండి గా చెప్పడం జరిగింది . ఇటీవల ఎన్టీఆర్ పై 100 రూ : నాణెం విడుదల సందర్భం గా బీజేపీ అధ్యక్షుడు నడ్డా తో చంద్రబాబు కలసిన విషయం విదితమే. అనంతరం ఆయన ఢిల్లో విలేఖరులతో మాట్లాడుతూ సూచన ప్రాయం గా పొత్తులపై స్పందించారు . మరింత విపులమైన సమాచారం కోసం ఈ క్రింది వీడియో చూడండి . https://www.youtube.com/watch?v=xJFMQ70UM1g