Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshతానా TANA నూతన అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు  

తానా TANA నూతన అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు  

అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘం ( తానా ) ఉత్తర అమెరికా తెలుగుసంఘం నూతన అధ్యక్షునిగా నిరంజన్‌ శృంగవరపు పదవీ బాధ్యతల స్వీకారం . TANA

నిరంజన్ ఈ పదవిలో 2 సంవత్సరాలపాటు కొనసాగుతారు . 

తన రెండేళ్ళ పదవీకాలంలో తానా టీమ్‌తో కలిసి తెలుగు రాష్ట్రాల్లో తానా సేవలను మరింత విస్తృతపరుస్తానని నిరంజన్‌ శృంగవరపు  అన్నారు. 

ఉచిత కంటి చికిత్స శిబిరాలు, క్యాన్సర్‌ శిబిరాలు, రైతులకు అవసరమైన రక్షణ పరికరాలు, ఇఎన్‌టి, ఇతర చికిత్సలకోసం వైద్యశిబిరాలను ఏర్పాటు చేయడంతోపాటు, పేద విద్యార్థులు ఇబ్బందులు పడకుండా వారు చదువును కొనసాగించేందుకు వీలుగా స్కాలర్‌ షిప్‌ లను, మహిళలకు కుట్టు మిషన్లు, వికలాంగులకు ట్రై సైకిళ్ళు వంటి వాటిని పెద్దఎత్తున పంపిణీ చేస్తామని తానా నూతన అధ్యక్షులు నిరంజన్‌ తెలిపారు. 

అమెరికాలోని తెలుగు వారితో పాటు, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారికి తానా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు . 

నిరంజన్‌ శృంగవరపు కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ పరిధిలోని రాజానగరం . 

గ్రాడ్యుయేషన్ తర్వాత, నిరంజన్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశారు . 

 2001లో USకి వెళ్లారు. 

 తానాలో అంచెలంచెలుగా ఎదిగారు. తానా ఫౌండేషన్‌ చైర్మన్‌గా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు . 

కోవిడ్‌ సమయంలో నిరంజన్  ఫౌండేషన్‌ ద్వారా కోట్లాదిరూపాయలతో నిత్యావసర సరుకులను అందించారు. 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments