జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికి అందించిన మహా ఆయుధం సత్యాగ్రహం. చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున ఆయన బాటలో నిరాహారదీక్ష చేపట్టాలని తెలుగుదేశం నిర్ణయించింది. ఇందులో భాగంగానే రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, హస్తినలో నారా లోకేష్, రాజమహేంద్రవరం క్యాంపు సైట్ లో నారా భువనేశ్వరి నిరశన దీక్ష చేస్తున్నారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం నాయకులు, శ్రేణులు కూడా నిరశన దీక్ష చేపడుతున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా తెలంగాణలోనూ తెలుగుదేశం నిరసన దీక్షలు చేపట్టింది. గాంధేయ పద్ధతుల్లో చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా గాంధీ జయంతి రోజున దేశ విదేశాల్లో తెలుగుదేశం అభిమానులు, ప్రజాస్వామ్య వాదులు ఒక రోజు నిరాహాద దీక్ష చేస్తున్నారు.