Hyderabad: తెలంగాణ ఎన్నికల వేళ హైదరాబాద్ వేదికగా సీడబ్ల్యూసీ సమావేశం: తెలంగాణపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అనేది విదితమే . సునీల్ కానుమోలు ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగాలు అనుక్షణం ఇక్కడి రాజకీయ విశేషాలు న్యూ ఢిల్లీ కి చేరవేస్తున్నట్లు సమాచారం . ఇక త్వరలోనే హైదరాబాద్‌కు కాంగ్రెస్ అగ్ర శ్రేణి నాయకత్వం తరలి వస్తున్నారు . కర్ణాటక రాష్ట్రం లో ఏవిధంగా విభిన్న వర్గాలను కట్టడి చేసి విజయం సాధించారో అదే ఫార్ములా తెలంగాణలోను అమలుపరచి అధికారం దక్కించుకోవాలనే లక్ష్యంతో అడుగులు వేస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై పూర్తి స్థాయిలో కాంగ్రెస్ తన దృష్టి సారించింది. సోనియా గాంధీ సెప్టెంబర్ 17న తెలంగాణ ఎన్నికల సమర శంఖం పూరించ నున్నారు .
అందులో భాగంగా.. సెప్టెంబరు 16, 17 తేదీల్లో హైదరాబాద్ లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరుగనుంది . సీడబ్ల్యూసీ కార్యవర్గ పునర్ వ్యవస్థీకరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశం హైదరాబాద్‌లో జరపాలని తెలంగాణ పీసీసీ ప్రతిపాదించి, అధిష్టానానికి లేఖ రాసింది. సోనియా గాంధీ, రాహుల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, ప్రియాంకా గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, అశోక్ గెహ్లాట్, భూపేష్ భాగేల్, సుఖ్విందర్ సింగ్ సుఖు సహా 39 మంది వర్కింగ్ కమిటీ సభ్యులు ఈ సమావేశం పాల్గొనడానికి హైదరాబాద్ రానున్నారు .
September 17 తేదీ ప్రాముఖ్యత తెలిసిందే .. తెలంగాణ ను ఇచ్చిన పార్టీ గా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఒక ఎమోషనల్ అప్పీల్ చేయనుంది . కెసిఆర్ కూడా సోనియమ్మ ను తెలంగాణ దేవత గా అభివర్ణించిన సంగతి విదితమే కదా . సెప్టెంబరు 17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైన రోజు కావడంతో గాంధీ భవన్ లో వేడుకల్లో, అమరవీరుల స్థూపం వద్ద సోనియాగాంధీ ముఖ్య అతిథిగా పాల్గొంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీ చేసిన త్యాగాలేమిటో సోనియా తెలంగాణా ప్రజానీకానికి వివరిస్తారు.
సెప్టెంబర్ 17న సోనియా తన ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసే అంశాలతో పాటు , పార్టీ మేనిఫెస్టోను ప్రకటించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం . సెప్టెంబర్ నెలాఖరు లోపు కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థుల జాబితా ను ప్రకటించే అవకాశం స్పష్టంగా వుంది . గాంధీ జయంతి నుంచి తెలంగాణ కాంగ్రెస్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క, శాసన మండలి పక్షనేత టి.జీవన్‌రెడ్డి, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డితోపాటు కీలక నేతలంతా నెల పాటు బస్సుయాత్ర చేపట్టనున్నారు.