వెలుగులోకి వచ్చిన సంచలన నిజాలు
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో లో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయడం వల్ల ఆంద్రప్రదేశ్‌లోని CVoter కోసం IANS నిర్వహించారు. ఈ ప్రత్యేక సర్వేలో ఓటర్లలో చంద్రబాబు పట్ల సానుభూతి మరింత పెరిగిందని తేలింది. ఈ సర్వేలో అత్యధిక మెజారిటీ చంద్రబాబు కి సపోర్ట్ గా వున్నారని స్పష్టం అయ్యింది.
మొత్తం మీద, 53 శాతానికి పైగా ఆంధ్రప్రదేశ్ వాసులు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్ట్ చేసారని అభిప్రాయానికి వచ్చారని తెలుస్తోంది.
2014లో నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సిమెన్స్‌తో సహా కొన్ని ప్రైవేట్ రంగ సంస్థల సహకారంతో ఆయన ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఆరోపణలను తెదేపా తీవ్రంగా ఖండించింది. మరియు ఇది రాజకీయ ప్రతీకార చర్య అని పేర్కొంది. రాష్ట్రంలో వచ్చే ఏడాది లోక్‌సభ మరియు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ విషయం మరింత వివాదాస్పదంగా మారుతోంది.
YSRCP అధినేత, ఏపీ సీఎం YS జగన్ అక్రమంగా చంద్రబాబుని ఇరికించి అరెస్ట్ చేయించారనే అభిప్రాయానికి ఏపీ ప్రజలు వచ్చారని సి-ఓటర్ సర్వే ద్వారా తేలినట్లు సమాచారం.
మొత్తం మీద 58 శాతం మంది జగన్ రెడ్డి ఆందోళన, అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే చంద్రబాబును పోలీసు ఆపరేషన్ లో అరెస్టు చేయించారని అభిప్రాయపడ్డారు.
సీ ఓటర్ సర్వే ప్రకారం ఈ అంశంపై పార్టీలకు అతీతంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో 86 శాతం మంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అభద్రతా భావంతో ఉన్నారని, అందుకే మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని ఆదేశించారని చెప్పారు.
బీజేపీ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో మూడింట రెండొంతుల మంది ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతుదారులుగా గుర్తించిన వారిలో 36 శాతం మంది తమ నాయకుడు జగన్ రెడ్డి అభద్రతా భావానికి లోనవుతున్నారని అభిప్రాయపడ్డారు.
సొంత పార్టీ కార్యకర్తలు కూడా 36 శాతం మంది జగన్ రెడ్డి కి ఓటమి భయమని తేల్చడంతో వైసీపీ పని అయిపోయిందన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది.
సొంత క్యాడర్ లోనూ పదే పదే వ్యతిరేకత తెచ్చుకుంటూండటం… ఓటమి భయంతో ఏం చేస్తున్నారో తెలియనట్లుగా ప్రవర్తిస్తూండటంతో… వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమేనని వైసీపీ వర్గాలు కూడా ఓ అంచనాకు వచ్చినట్లు రాజకీయ వర్గాల సమాచారం .