Putrada Ekadashi 2023: శ్రావణ మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథిని శ్రావణ పుత్ర ఏకాదశి లేదా పుత్ర ఏకాదశి అంటారు. ఈ రోజున హరి నామ స్మరణ తో గడపాలి . సంతానం కోరుకొనే వారు తప్పకుండా ఈ పుత్రదా ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు ని తమ తమ శక్తికొలదీ పూజించాలి .
శ్రావణ పుత్ర ఏకాదశి పూజ విధానం..
సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. విష్ణువు విగ్రహం ముందు నెయ్యి దీపం వెలిగించండి. ఉపవాసం చేస్తానని ప్రమాణం చేయండి. సాయంత్రం విష్ణుమూర్తిని పూజించిన తరువాత, మీరు కోరుకుంటే, మీరు పండ్లు తినవచ్చు. ఈ రోజు విష్ణుసహస్రనామ పారాయణం చేయండి.
వీలైతే ఏకాదశి రోజు రాత్రి ,పగలు జాగరణ చేయండి. ద్వాదశి తిథి నాడు బ్రాహ్మణులకు ఆహారం ఇతర వస్తువులను దానం చేయండి. పెరుగు దానం చేయడం శ్రేయస్కరం . ప్రసాదం తినడం ద్వారా మీ ఉపవాసాన్ని విరమించండి.
శ్రావణ పుత్ర ఏకాదశి రోజున ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం, రవియోగం, సర్వార్థ సిద్ధి యోగం, బుధాదిత్య యోగం జరుగుతున్నాయి.
ఏకాదశి నాడు 5 అరుదైన యోగాల కలయిక:ప్రీతి యోగా – 26 ఆగస్టు 2023 4:27 PM నుండి 27 ఆగస్టు 2023 1:27 PM వరకు. మరింత సమాచారం కోసం ఈ క్రింది వీడియొ చుడండి .