బైజుస్ కంటెంట్‌లో (ByJu’s content) అవినీతి జరిగిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ (BJP National Secretary Satya Kumar) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. బైజుస్‌లో జరిగిన అవినీతిపై ఆధారాలు సేకరిస్తున్నామని.. త్వరలోనే కేసులు పెడుతామని అన్నారు.
రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారన్నారు. పాలన గాలికి వదిలేసి… పరిస్థితులు అగమ్యగోచరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయని విమర్శించారు.