Saturday, September 7, 2024
spot_img
HomeElections 2023-2024కాంగ్రెస్ లోకి కడియం

కాంగ్రెస్ లోకి కడియం

గులాబీ దళపతి కేసీఆర్‌కు పార్లమెంట్ ఎన్నికల వేళ విశేషం మరో ఎదురుదెబ్బ తగిలేలా ఉంది. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ కు రాజీనామా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . త్వరలోనే కడియం కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికే గులాబీ నేతల రాజీనామాలతో మెల్లి మెల్లిగా ఖాళీ అవుతున్న బీఆర్ఎస్ పార్టీకి మరో బడా నేత రాజీనామా చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే,మాజీ మంత్రి, కడియం శ్రీహరి బారాసా కు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం . ఈ క్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో ఆయన టచ్‌లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు కథలు కథలుగా వినిపిస్తున్నాయి .

Kadiam into Congress

కడియం శ్రీహరి పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలపై తాను ఏమాత్రం స్పందించకపోవడంతో ,అది నిజమే అని నమ్మాల్సి వస్తుంది ,అదికాక వారు స్పందించకపోవటం వలన ఈ ఈ పుకార్లకు మరింత బలం చేకూరినట్లైంది.బారాసా కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు కడియం శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రెండు ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తుంది . అవి ఏమిటంటే మొదటిది రానున్న లోక్ సభ ఎన్నికల్లో నా కూతురు కావ్యకు లోక్ సభ టికెట్ ఇవ్వాలని,రెండోది రేవంత్ మంత్రి వర్గంలో నాకు చోటు ఇవ్వాలని కడియం శ్రీహరి కోరినట్లు సమాచారం . నన్ను మంత్రిని చేస్తే నా క్యాడర్ తో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరుతానని సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కడియం కమాండ్లను డిమాండ్లను విన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అన్ని విషయాలను కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలకు కు తెలిపారు. దీనిపై త్వరలోనే కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీలో చేరాలని స్థానిక నేతల నుంచి కడియం శ్రీహరి పై ఒత్తిడి రాను రాను పెరుగుతున్నట్లు సమాచారం . కడియం కాంగ్రెస్‌లోకి వెళ్లాలని మాజీ సర్పంచులు ,ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తుంది . కడియం కూతురు కావ్య కు ఎంపీ టికెట్ ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కడియంకు మాత్రం మంత్రి పదవి ఇచ్చే విషయంలో కాస్త సందిగ్ధత అయితే నెలకొంది అన్నట్లు వార్తలు వస్తున్నాయి . అయితే కాంగ్రెస్ పార్టీలో కడియం కు తగిన ప్రాధాన్యత ,సముచిత స్తానం ఉంటుందని కాంగ్రెస్ సంకేతాలు పంపినట్లు సమాచారం. కానీ పార్టీ మారే విషయంలో కడియం శ్రీహరి బారాసానా కాంగ్రెస్సా అని ఎటూ తేల్చుకోలేక తర్జనభర్జన పడుతున్నారు అని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల్లో ,నేతల్లో చర్చ జరుగుతుంది అని సమాచారం .సమయం తక్కువ ఉన్న ఈ సందర్భంలో కడియం శ్రీహరి ఎటువైపు వెళతారో వేచి చూడాల్సిందే .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments