మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం టీడీపీ నిర్వహించిన బంద్ విజయవంతం .
నియోజకవర్గ , మండల స్థాయి నాయకుల ను గత రెండు రోజులుగా హౌస్ అరెస్ట్ లో వున్నా ప్రజలు , కార్యకర్తలు బంద్ ను విజయవంతం చేశారు .
తెదేపా బంద్ లో జనసేన పూర్తి స్థాయి లో పాల్గొంది . సిపిఐ , సిపిఎం , లోకసత్తా , జైభీమ్ పార్టీ ప్రజాసంఘాల సంఘీభావం .
నందమూరి బాలయ్య బాబు ఇక ప్రజా పోరాటానికి సిద్ధమయ్యారు . చేతులు ముడుచుకొని కూర్చోమని , ప్రజల్లోకి వస్తానన్నారు .
స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో సీఐడీ విచారణ అధికారి దాఖలుచేసిన రిమాండ్ రిపోర్టు కాకమ్మ కబుర్లు చెబుతున్నట్టుగా ఉందని సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు విమర్శించారు.
చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత TPCC President Revanth reddy భార్య గీత రెడ్డి , నారా భువనేశ్వరికి ఫోన్ చేసి తన మద్దతును ప్రకటించారు. ఈ కష్ట సమయంలో ఆమెకు తోడుగా ఉంటానన్నారు. తన మాటల ద్వారా ఆమెకు బలం చేకూర్చారు.
Sec 17 క్రింద గవర్నర్ అనుమతి లేకుండా బాబు అరెస్టు తప్పు.. తప్పుడు సమాచారంతో నివేదిక సమర్పించారు
పోలీసులు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు ..సీబీఐ మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు
లండన్ పర్యటన ముగించుకొని ఏపీకి చేరుకున్న జగన్ దంపతులు .
చంద్రబాబు కు పొంచివున్న ప్రాణహాని దృష్ట్యా హౌస్ రిమాండ్ పై ఈ రోజు న్యాయమూర్తి హిమబిందు తీర్పును ఇచ్చే అవకాశం .
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌తో యువతకు మేలు జరిగింది.14ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తిని హింసిస్తున్నారు.సైకో సంతృప్తి కోసం వ్యవస్థలు పనిచేస్తున్నాయి.అధికారులు ఇలా వ్యవహరించడం దారుణమని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు.విమర్శించారు .
చంద్రబాబు అరెస్ట్ ను భాజాపా ఎంపీ లక్ష్మణ్ తప్పుపట్టారు . అరెస్ట్ చేసిన విధానం సరైనది కాదన్నారు .
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబు నాయుడు ను అరెస్ట్ ను ఖండించారు . రాజకీయ కక్ష్య సాధన ప్రజాస్వామ్యానికి చేటు అన్నారు .