తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం తో తెలంగాణ CS శాంతకుమారి అధికారులను అప్రమత్తం చేశారు . ఈ ఉదయం 8 గంటల వరకు మియాపూర్‌లో 65.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాప్రా 63.8 మి.మీ, చెర్లపల్లి 62.8 మి.మీ, లంగర్ హౌజ్ 60.5 మి.మీ, హైదర్‌నగర్ 59.5 మి.మీ, చద్రాయణగుట్ట 58.8 మి.మీ.
అధికారుల సూచనలు : నివాసితులు జాగ్రత్తగా ఉండాలి . ఖచ్చితంగా అవసరమైతే తప్ప ఇంట్లోనే ఉండాలి . ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, నీరు నిలిచిన వీధులు మరియు అండర్‌పాస్‌ల గుండా వాహనాలు నడపడం మానుకోవాలి. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి . అధికారుల సూచనలు పాటించండి .
బయటి ఆహారపదార్ధాలు తినకండి . కాచి వడపోసిన నీటినే తాగండి . ఎలక్ట్రికల్ పోల్స్ , తెగిన వైర్లు పట్ల జాగ్రత్త వహించి అధికారులకు తెలుపండి . ఓపెన్ చేయబడిన మాన్ హోల్స్ ను గుర్తించడం కోసం ఏదైనా జెండా లేదా కర్ర పాతండి . GHMC Help Line : Heavy rainfall is expected to continue over the city until the evening. Citizens may dial 9000113667 for DRF assistance,” a tweet by the Director Of Enforcement Vigilance & Disaster Management of the municipal body said.