Saturday, December 21, 2024
spot_img
HomeElections 2023-2024ఫలిస్తున్న రేవంత్ వ్యూహం ..దిక్కుతోచని స్థితిలో కేసీఆర్

ఫలిస్తున్న రేవంత్ వ్యూహం ..దిక్కుతోచని స్థితిలో కేసీఆర్

త్వరలో జరగనున్న లోక్ సభా ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారు .మొత్తం 17 స్థానాల్లో 15 స్థానాలు కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు . ఇందులో భాగంగా పార్టీ బలహీనంగా ఉన్న చోట ..బలోపేతం చేసేలా ప్రణాళికలు రచిస్తున్నారు ..ఈ నేపథ్యంలోనే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున చేరికలని ప్రోత్సహిస్తున్నారు . ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పలు జిల్లాల్లో కాంగ్రెస్ మెరుగైన ఫలితాలు సాధించింది. ముఖ్యంగా వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. మరికొన్ని జిల్లాల్లోను మెజారిటి స్ధానాల్లో గెలిచింది. అయితే గ్రేటర్ పరిధిలో మాత్రం ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది .

Revanth’s strategy is paying off..KCR is in a state of disorientation.

రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో కనీస స్థాయి సీట్లని పొందలేకపోయింది .. పార్లమెంటు ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో 5 స్ధానాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్, మెదక్, చేవెళ్ళ, మల్కాజ్ గిరి స్ధానాలు గ్రేటర్ పరిధిలో ఉన్నాయి .. వీటిలో కనీసం నాలుగు గెలవాలన్నది హస్తంపార్టీప్రయత్నం. అలా గెలవాలంటే బలమైన నేతలు అవసరం. అందుకనే గా బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ దృష్టిపెట్టారు. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ నునీతారెడ్డిని చేర్చుకున్నారు. తాజాగా మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, ఆయన కోడలు రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ అనీతారెడ్డి చేరారు.

అలాగే జీహెచ్ఎంసీ డిప్యుటి మేయర్ మోతె శ్రీలతారెడ్డి, శోభన్ రెడ్డి దంపతులు చేరబోతున్నారు. చేరికలతో కారుపార్టీని గట్టి దెబ్బకొట్టాలని రేవంత్ పావులు కదుపుతున్నారు. ఇక బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరుతున్న చాలామంది నేతలు హఠంలో కాంగ్రెస్ లో ఉన్నోళ్లే.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత .. చాలామందిని తమ పార్టీలోకి లాగేసుకున్నారు. అప్పట్లో కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారు .. మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఎంతవీలైతే అంతమందిబీఆర్ఎస్ నేతలను హస్తంలోకి చేర్చుకోవాలన్నది రేవంత్ ఆలోచన. త్వరలోనే మరిన్ని చేరికలు ఉండొచ్చని తెలుస్తుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments