Tuesday, September 17, 2024
spot_img
HomeNewsఎంపీ ఎలక్షన్స్ లోను రేవంతే రారాజు

ఎంపీ ఎలక్షన్స్ లోను రేవంతే రారాజు

ఎంపీ ఎలక్షన్స్ లోను రేవంతే రారాజు
(ప్రముఖ సర్వే)
బాజాపా బారాసా లకు “బిగ్ షాక్”
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ దే పై చేయి..?

ఎంపీ ఎలక్షన్స్ దగ్గరపడుతున్న ఈ తరుణంలో దేశవ్యాప్తంగ ఎన్నికల సర్వేలు మొదలు అయ్యాయి.దేశం సంగతి పక్కన పెడితే ,నువ్వా నేనా డి అంటే డి అని వాడి వేడిగా ఒక యుద్ధం తలపించేలా ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఒకసారి పరిశీలిద్దాం రండి .
ఇండియాలో ఉన్న ప్రముఖ సర్వే సంస్థలు అన్ని దేశవ్యాప్తముగా జరగబోయే ఎంపీ ఎలక్షన్స్ లో గెలవబోయే గెలుపు గుర్రాలు ఎవరు అని దేశవ్యాప్తంగ సర్వే చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు .
దేశవ్యాప్త సర్వే పక్కన పెడితే భారతదేశంలోనే టాప్ 5 ప్రముఖ సర్వే సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం .
తెలంగాణనే ఎందుకు ఎంచుకున్నారు అంటే ,ఇక్కడ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ & బీజేపీ ఒక ప్రాంతీయ పార్టీ BRS ముగ్గురు ఒకరినిమించి ఒకరు బురద జల్లుకునే ప్రయత్నం చేస్తూ తెలంగాణ ఓటరుని తికమక పెడుతున్నారు ,ఆ తికమకని ఛేదించటానికి ప్రముఖ సర్వే సంస్థలు తెలంగాణాలో రంగంలోకి దిగాయి .
మొదటగా తెలంగాణాలో రెండు నెలల క్రితం అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఆరు హామీలు చెప్పి అధికారంలోకి వచ్చిన జాతీయ కాంగ్రెస్ పార్టీ , అధిష్టాన నిర్ణయమే తుది నిర్ణయం అయినా ,ఇక్కడ మాత్రం జాతీయ కాంగ్రెస్ పార్టీ అనే కన్నా ,తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అనే పేరు రాష్ర వ్యాప్తముగా వినపడుతుంది ,
ఢీనికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి .అసెంబ్లీ ఎలెక్షన్స్లో చెప్పిన మాట ప్రకారం ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ సుస్థిరంగా కొలువైంది రేవంత్ సర్కార్ . అదే ధీమాతో ఎంపీ ఎలేక్షన్స్లో పోటీ చేసి 17 సీట్లకు గాను 15 సీట్లు తెచ్చుకోవాలి అని రేవంత్ సర్కార్ జోరుగా ఉంది .
రెండవ పార్టీ భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ నినాదం అయోధ్య రామమందిర నిర్మాణం తో ఎన్నికల్లోకి వెళ్తున్నారు .బీజేపీ లో సరి అయినా నాయకుడు లేడు ,బండి సంజయ్ ని అధ్యక్షుడిగా తప్పించి బీజేపీ అధిష్టానం పెద్ద తప్పు చేసింది అనే చెప్పాలి ,
వారు యెంత నష్ట పోయారో అసెబ్లీ ఎన్నికలే ఉదాహరణ .అయినా పట్టు వదలకుండా ప్రచారం చేస్తున్నారు , ఈ ఎంపీ ఎలేక్షన్స్లో జై శ్రీరామ్ నినాదంతో పోటీ చేసి గట్టి పోటీ ఇస్తూ 17 సీట్లకు గాను 17 సీట్లు గెలుస్తాము అనే గట్టి నమ్మకంతో ఉన్నారు .
ఇక మూడవ పార్టీ ప్రాంతీయ పార్టీ జై తెలంగాణ నినాదంతో పుట్టిన TRS పార్టీ నేడు BRS గ మారినది ,తెలంగాణను పదేళ్లు పరి పాలించిన టీఅర్ఎస్ పార్టీ నేడు బీఆర్ఎస్ పార్టీకి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బారి షాక్ ఇచ్చాయి.
పదేళ్ల పరిపాలనలో వీరు చేసిన తప్పులు కాళేశ్వరం ప్రాజెక్ట్ ,మేడిగడ్డ బ్యారేజి లలో నాణ్యతలేవి నిర్మాణం , యువతకు సరి అయినా ఉద్యోగ నోటిఫికెషన్స్ ఇవ్వలేకపోవటం,డబుల్ బెదురూమ్ ఇల్లు ఇవ్వలేక పోవటం ,పలు సంస్థల్లో అప్పులు చెయ్యటం ,అవినీతితో గత ప్రభుత్వ అధికారులు ,అవినీతి ఆరోపణలతో గత ప్రభుత్వం కూరుకు పోయింది . అవినీతి ఆరోపణలపై నేడు అసెంబ్లీలో సమావేశాలు నడుస్తున్న ఆ అవినీతి ఆరోపణలు నిజం కాదు అని నిరూపించుకోలేని అయోమయ స్థితిలో ప్రతిపక్ష పార్టీ BRS అధినేత గులాబీ దళపతి కెసిఆర్ ఉన్నారు.
ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తారుమారు అయినా లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 16 స్థానాల్లో గెలిచి గులాబీ జెండా ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది అని సమాచారం .
కానీ ఈ మూడు పార్టీల అంచనాలకు చెక్ పెడుతూ ఒక ప్రముఖ సర్వేసంస్థ భారీ షాక్ ఇచ్చింది.
జరగబోయే MP ఎలెక్షన్స్లో తెలంగాణలో కాంగ్రెస్ 10 స్థానాల్లోనూ , బీజేపీ మూడు స్థానాల్లో ను , బీఆర్ఎస్ కూడా మూడు స్థానాల్లో ను ,MIM ఒక స్తానంలో ,విజయం సాధిస్తాయని తెలిపింది .
షాకింగ్ న్యూస్ ఏమిటంటే తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో నేడు జరిగే పరిణామాల దృష్ట్యా BRS ఈ సారి సిట్టింగు స్థానాలను కూడా కోల్పోయే అవకాశం కూడా ఉంది అని ఆ సర్వే తెలిపింది ,
ఏది ఏమైనా ఎంపీ ఎలేక్షన్స్లో తెలంగాణ ప్రజల తీర్పు భారతదెశ రాజకీయాల్లో కీలకం కాబోతుంది .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments