Sunday, December 22, 2024
spot_img
HomeElections 2023-2024సీఎం పదవికి రేవంత్ రాజీనామా..?

సీఎం పదవికి రేవంత్ రాజీనామా..?

సీఎం పదవికి రేవంత్ రాజీనామా..? ముఖ్యమంత్రిగా హరీష్..?

సీఎం రేవంత్ కి ఎమ్మెల్యే హరీష్ సవాల్
మేడిగడ్డను తక్షణమే రిపేర్ చేయాలని.. కాంగ్రెస్ సర్కార్ కి డిమాండ్
చేయలేకపోతే సీఎం పదవి నుంచి.. రేవంత్ దిగిపోవాల్సిందేనన్న హరీష్
తప్పు జరిగితే ఎవడైనా సరే.. దోషులపై చర్యలు తీసుకోవాల్సిందే..?
కెసిఆర్ తప్పు చేస్తే అరెస్ట్ చేయాల్సిందే..?
తన్నీరు హరీష్ దెబ్బకు కెసిఆర్ కటకటాల్లోకేనా..?
మేడిగడ్డ బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.. కడియం డిమాండ్

తెలంగాణ అసెంబ్లీలో మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు పై రసవత్తరంగా అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ నేతల మధ్య రసా బసా కొనసాగ్గింది.

ఇటీవలే సీఎం రేవంత్‌రెడ్డి సహా ఇతర మంత్రుల మేడిగడ్డ సందర్శనకు వెళ్లొచ్చారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో భారీ నష్టం జరిగిందనే అంచనాతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు సీఎం రేవంత్. బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ ఖజానా డబ్బు వృథా అయ్యిందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యాంగా ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయని తెలిపారు.ఇదే క్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ కుంగిన మేడిగడ్డను వెంటనే రిపేర్ చేయించడం రేవంత్ రెడ్డి వల్ల కాకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి తనకు సీఎం పదవి ఇస్తే చేసి చూపిస్తానని మాజీ మంత్రి హరీష్ రావు రేవంత్ కు సవాల్ విసిరారు. రిపేర్లకు ఇప్పటికీ అవకాశం ఉందని ఇంజినీర్లు చెబుతున్నా సర్కారు పట్టించుకోవడం లేదని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్ రావు… కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు సరఫరా చేయడం చేతకాకపోతే వెంటనే దిగిపోవాలని అన్నారు. అది చేతకాక ఓట్ల కోసం కాంగ్రెస్ బురద రాజకీయాలు చేస్తోందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే ఒక్కటే బ్యారేజీ కాదన్నారు. మేడిగడ్డలో ఒకట్రెండు పిల్లర్లు కుంగినంత మాత్రాన దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నారని విమర్శించారు.ప్రాజెక్ట్ ను డ్యామేజ్ చేయాలని కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు. అక్రమాలు జరిగితే విచారణ జరపాలని అసెంబ్లీలోనే తాము డిమాండ్ చేశామని చెప్పారు. దోషులను శిక్షించాలన్న ఆయన, ఆలోపు పునరుద్ధరణ పనులు చేపట్టి రైతులకు నీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశంలో ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పాలనలో సింగూరు డ్యాం 1981, 1999లో కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ హయాంలో 2010లో ఎల్లంపల్లి డ్యాం కొట్టుకుపోయిన విషయం గుర్తుకులేదా అని ప్రశ్నించారు.కేంద్రం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు సైతం కూడా కొట్టుకుపోయిందన్నారు. పంజాగుట్టలో ఫ్లైఓవర్ నిర్మిస్తుండగానే కూలిన ఘటన మర్చిపోయారా అని ప్రశ్నించారు.ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకుని మేడిగడ్డ పునరుద్ధరణ పనులు చేపట్టి రైతులకు నీళ్లు అందించాలని హరీష్ రావు కోరారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. బిఆర్ఎస్ పాలనలో పదేళ్లు అధికారాన్ని అడ్డం పెట్టుకొని, మేడిగడ్డ, కాళేశ్వరం నిర్మాణంలో నాటి అధికార పార్టీ నేతలు ఎంత నొక్కారో, ఎంత మెక్కారో మాత్రం చెప్పట్లేదని నెటిజన్లు హరీష్ రావు పై సెటైర్స్ వేస్తున్నారు.ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టి 2 నెలల్లోనే ఇచ్చిన మాటకు కట్టుబడి ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ దూసుకెళ్తుంటే ఓర్వలేక గులాబీ పార్టీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని రాష్ట ప్రజలు నవ్వుకుంటున్నారని ప్రచారం జరుగుతుంది.
సీఎం రేవంత్ రెడ్డి సీఎం పదవి దిగేదే లే అని మరో పదేళ్లు రేవంతే ముఖ్యమంత్రి అని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ వ్యూహాలకు తట్టుకోలేని చోటా, బడా బారాసా నేతలు కారు ని కాలుతో తన్ని కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు తెలుసుకుంటున్నారు . మరి ఇలాంటి సమయంలో సీఎం రేవంత్ ని సీఎం పదవి నుండి దిగమనటం నీకు తగునా హరీష్ అని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments