ఆపరేషన్ కే – ఎపిసోడ్ 2
రేవంత్ దెబ్బకు కారు పార్టీ కాళీ..
కాంగ్రెస్ లోకి 32 మంది BRS ఎమ్మెల్యేలు జంప్..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి తన సత్తా చాటిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ ,మరోభారీ స్కెచ్ కు తెరలేపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . పార్లమెంట్ ఎలక్షన్స్ లోపే బారాసా పార్టీని మట్టికరిపించి పనిలో రేవంత్ రెడ్డి బారి స్కెచ్ వేసినట్లు తెలుస్తుంది . తాజాగా ఎఐసీసీ కూడా ఈ అంశం పై గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఢిల్లీ లో రాజకీయ పెద్దలను రేవంత్ రెడ్డి కలవటం కూడా జరిగింది . తెలంగాణాలో జరుగుతున్న వివిధ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని,ఓ వైపు పార్లమెంట్ అభ్యర్థులను ఫిక్స్ చేస్తూ ,రాష్ట్ర వ్యాప్తముగా బిఆర్
స్ ని ఎలా దెబ్బకొట్టాలో అన్న ఆలోచనలతో బారి స్కెచ్ వేస్తూ రేవంత్ రెడ్డి తనదైన శైలిలో వ్యూహాలు వేసుకుంటూ ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలోకి 32 మంది brs mla లు త్వరలోనే చేరుతున్నట్లు ,ఇప్పటికే ఒక గేటు ఎత్తాను ,ఇప్పుడు ఇంక గేట్లు ఎత్తాల్సి అవసరము ఎంతైనా ఉంది అని స్వయముగా రేవంత్ రెడ్డి అనటం రాజకీయ విశ్లేషకుల్లో చర్చనీయాంశం అయింది . ఇవాళ 32 మంది కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది ,ఇప్పటికే రేవంత్ రెడ్డి తన అనుచరగణముతో ,దానికి సంబందించిన mla లు అందరితో రేవంత్ రెడ్డి టీమ్ మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది.
రాజకీయాల్లో ఇవి అన్ని సహజం కానీ కొంత చరిత్రను రిపీట్ చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తుంది,దానికి అనుగుణముగానే రేవంత్ రెడ్డి కూడా పెద్ద ఎత్తున బారి స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తుంది . గతం కనుక ఒకసారి చూసుకుంటే brs అధికారంలో ఉన్నపుడు ,కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్షంలో ఉన్నపుడు brs పనికట్టుకుని clp ని విలీనం చేసుకుని కాంగ్రెస్ ని వీక్ చెయ్యాలి అని కెసిఆర్ చూసారు . అదే పద్దతిని నేడు కాంగ్రెస్ పార్టీ వాడుకుని ప్రధానముగా తెలంగాణాలో brs పార్టీని దెబ్బకొట్టాలి అని ఆలోచిస్తున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటె తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ,దాదాపుగా brs mla లు చాలామంది అంటే ఒక 32 మంది గులాబీ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి ఫిరాయిస్తారు అని తెలుస్తుంది. ఒక mla brs లో జాయిన్ అయితే ఆ తరువాత ఇంకొకరు జాయిన్ అవుతున్నారు ,ఆలా జాయిన్ అయిన వారితో మీరు మమల్ని కాంగ్రెస్లో జాయిన్ చేయండి అని ఒకరికి తెలియకుండా ఒకరు మంతనాలు జరుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఈ రోజు రేవంత్ రెడ్డి వాళ్ళ టీం తో సంప్రదింపులు జరిపి ఇమిడియట్ గ ఎవరు జాయిన్ అయితే వారిని కాంగ్రెస్ కండువా కప్పే ఆహ్వానించే ప్రయత్నాలు చేస్తున్నారు . మొత్తానికి brs mla లు అందరు కాంగ్రెస్ పార్టీలోకి కనుక జాయిన్ అయితే నిదానముగా brs lp అదే కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్షంలో ఉన్నపుడు brs పనికట్టుకుని clp ని విలీనం చేసుకుని కాంగ్రెస్ ని వీక్ చెయ్యాలి అని కెసిఆర్ ఎలా అయితే ఆలోచించారో brs LP ని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేసుకుని ,రాజకీయముగా గులాబీ దళపతి కెసిఆర్ ను పూర్తిగా బలహీన పరిచేవిదంగా అధికార కాంగ్రెస్ పార్టీ రేవంత్ సర్కార్ అడుగులు వేస్తుంది అని తెలుస్తుంది
దీనికి అనుగుణముగానే సుదీర్ఘముగా కాంగ్రెస్ పెద్దలతో చర్చలు జరిపి,రేవంత్ రెడ్డి తాను చేయాలి అనుకున్న ప్లాన్ ని వివరించిన , తరువాత , ఏఐసీసీ పెద్దలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . BRS వదిలి కాంగ్రెస్ పార్టీలోకి రావాలి అనుకుని సానుకూలంగ ఉన్న MLA లతో ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడినట్లు వారితో చర్చలు జరిపినట్లు సమాచారం . దాదాపుగా ఆ 32 మంది BRS MLA లు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టము తో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది . ఒకోకరు పార్టీలో జాయిన్ అయ్యేకన్నా ఒకేసారి లంసం గ 32 మంది జాయిన్ అయితే CLP లో విలీనం చేసుకోవచ్చు అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది . ఒకొకరుగా జాయిన్ అయితే విమర్శలు వస్తాయి అని ,ఒకేసారి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసుకోండి అని AICC పెద్దలు తీర్మానం చేసినట్లు తెలుస్తుంది . ప్రస్తుతం ఒకసారి అసెంబ్లీలో BRS MLA లను పరిశీలిస్తే కనుక 38 MLA లు ఉన్నారు ఇందులో 2/3,అంటే 26 మంది కాంగ్రెస్ పార్టీలోకి వెళితే ఫిరాయింపుల చట్టం వర్తించదు ,వీరంతా ఇష్టంతోనే పార్టీ మారుతున్నట్లు స్పీకర్ కు లేక ఇస్తే ఆ గ్రూపును కాంగ్రెస్లోకి విలీనం చేసే అధికారం స్పీకర్కు ఉంటుంది ,దీనితో LP లో విలీనం కు అవసరము అయిన 26 మంది కన్నా ఎక్కువ మంది BRS నుంచి కాంగ్రెస్లో చేరే అవకాశం కనపడుతుంది . కాబట్టి 26 మంది BRS MLA ల కన్నా ఎక్కువ మందిని జాయిన్ చేసుకునేలా కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తుంది . గతంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏవిధముగా కెసిఆర్ చేసారో అదే విధముగా రేవంత్ రెడ్డి బారి స్కెచ్ ఉండపోతుంది అని గాంధీభవన్ లో వార్తలు వినిపిస్తున్నాయి .