శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని GHMC హెచ్చరిక
వరుస వర్షాలు వరదలతో గత నాలుగు రోజులుగా హైదరాబాద్ GHMC పరిధిలో ప్రజలు అతలాకుతలమవుతుంటే .. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ సమస్యలను పరిష్కరించకుండా పారిపోయారంటూ మంత్రి KTR పై తెలంగాణ కాంగ్రెస్అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు . కేటీర్ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటూ ప్రజలను గాలికి వదిలేశారని మండిపడ్డారు.
ఈ మేరకు గురువారం ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘హైదరాబాద్ నగర ప్రజలు వరదలతో గోసపడుతుంటే బాధ్యతాయుత పదవిలో ఉంటూ.. పట్టించుకోకుండా పత్తాలేకుండా పోయారు. ఫాం హౌస్‌లో మీ అయ్య, పార్టీల్లో మీరు సేద తీరుతూ ప్రజలను వరదల్లో ముంచేశారు. ఎక్కడ గుంత ఉందో, ఎక్కడ మ్యాన్ హోల్ ఉందో అని ప్రజలు ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుంటూ తిరిగాల్సిన పరిస్థితి దాపురించిం ది. హైదరాబాద్‌ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన తండ్రీకొడుకులు నగరాన్ని నరక కూపంగా మార్చారు’’ అని రేవంత్ అన్నారు .
గడిచిన 9 ఏళ్లలో నగరంలో సౌకర్యాల కల్పనకు అవసరమైన చర్యలు చేపట్టలేదని, ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నట్లుగా అన్నీ జరిగితే ఐటీ కారిడార్ నుంచి హయత్‌నగర్ దాకా ట్రాఫిక్ జామ్(Traffic jam)లు ఎందుకని రేవంత్ ప్రశ్నించారు . ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారని, పది నిమిషాల ప్రయాణానికి రెండు గంటల సమయం పడుతోందని దుయ్యబట్టారు. ఫ్లై ఓవర్ల కింద అండ ర్ పాస్‌ల్లో నీళ్లు నిండిపోయి వాహనా లు వెళ్లలేక జనాలు ఇబ్బంది పడుతుం టే స్ట్రాటజిక్ రోడ్లు అంటూ మీరు చేసే హడావుడి అంతా డొల్లే అని రుజువైందన్నారు . GHMC పరిధిలోని టీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారం భూములు, చెరువులను కబ్జా చేస్తూ అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని రేవంత్ విమర్శించారు . హైదరాబాద్‌లో ఇంత తీవ్ర విధ్వంసం జరుగుతుంటే కనీసం సమీక్ష చేయడానికి మీకు సమ యం లేకుండా పోయిందని, వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించినా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం అధికారులకైనా ఆదేశాలివ్వాలనే ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవరిస్తున్న మిమ్మల్ని ఏ విధంగా శిక్షించినా పాపం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు.
ఇప్పటికైనా ప్రజల కష్టాలను తీర్చే యత్నం చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో జీహెచ్‌ఎంసీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని రేవంత్హె రెడ్డి హెచ్చరించారు.