అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్న కాంగ్రెస్ .. లోక్ సభా ఎన్నికల్లోనూ సత్తా చాటడానికి సమాయత్తం అవుతుంది ..ఇందులో భాగంగా బలమైన అభ్యర్ధులని బరిలో దించే దిశగా అడుగులు వేస్తుంది .. తాజాగా నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో రేవంత్ రెడ్డి తొలి అభ్యర్థిని ప్రకటించారు. మహబూబ్‌నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి పేరును రేవంత్ రెడ్డి ప్రకటించారు. వంశీచంద్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు తన నియోజకవర్గం కొడంగల్ నుంచే 50 వేల మెజార్టీ రావాలన్నారు.
అంతేకాక లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గానూ 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తుందన్నారు. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలుపొందిన వంశీచంద్.. . విద్యార్థి దశ నుండే రాజకీయాల్లో వచ్చారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఒక సీటు ఖారావడంతో ..మిగతా అభ్యర్థులు ఎవరు అనే దానిపై ఆసక్తి నెలకొని ఉంది ..సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ , కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, విద్యా స్రవంతి టికెట్ ఆశిస్తున్నారు. చేవెళ్ల నుంచి వికారాబాద్ జడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డి వినిపిస్తుంది
మల్కాజిగిరి నుంచి బలమైన నాయకుడిని దించాలని చుస్తునారు . నల్గొండ నుంచిసీనియర్ నేతలు జానారెడ్డి, దామోదరరెడ్డి, కోమటిరెడ్డి కుటుంబసభ్యులు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మీ కూడా రేసులు ఉన్నారు . ఖమ్మం నుంచి పొంగులేటి, భట్టి, తుమ్మల కుటుంబాల నుంచి టికెట్ ఆశిస్తున్నారు. అలాగే మిఫతా స్థానాల్లోనూ పోటీ ఎక్కువగా ఉంది ..ఈ నెలాఖరుకి వడపోత పూర్తి చేసి .. షెడ్యూల్ రాగానే .. కుదిరితే షెడ్యూల్ కంటే ముందే అభ్యర్ధులని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి .