ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు నువ్వా నేనా … ఎవరో ఒకరే ఉండాలి అనే స్థాయి లో సాగుతున్నాయి . అధికార పార్టీ పై ప్రజా వ్యతిరేకత తీవ్రమౌతున్న తరుణం లో ఆశనిపాతంలా వైస్ షర్మిల YSRTP పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చెయ్యడానికి ముహూర్తం ఖరారు అయినట్లు వార్తలు వస్తున్నాయి . సాక్షాత్తు ప్రతిపక్ష నేత పై A1 గా ఎకాఎకీ హత్యాయత్నం కేసు, ఆయన తో పాటు సుమారు 300 మంది పై పెట్టారు . ఇది చూస్తుంటే ఇక అధికార పార్టీ తమ కార్యకర్తలను , తాము చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం (గడప గడపకూ ) విఫలమై , ఇక పోలీసు యంత్రాంగాన్ని నమ్ముకున్నదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది .
జగన్మోహన్‌రెడ్డి మానసిక వైకల్యంతో బాధపడుతున్నారని ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలకు రాసిన లేఖలో నారా చంద్రబాబు నాయుడు ప్రస్తావించారు. దీనిపై రెబెల్ వైకాపా ఎంపీ రఘురామ మాట్లాడుతూ మానసిక వైకల్యంతో బాధపడుతున్నవారు రాజ్యాంగ పదవుల్లో కొనసాగడానికి వీలు లేదు. సీఎంపై ప్రధాన ప్రతిపక్ష నేత చేస్తున్న ఆరోపణలను నిగ్గు తేల్చాలని వైసీపీ సభ్యునిగా డిమాండ్ చేస్తున్నా’’ నన్నారు .
ఢిల్లీ లో మాట్లాడుతూ రఘురామ కృష్ణం రాజు “జగన్మోహన్‌రెడ్డి మానసిక పరిస్థితిపై చంద్రబాబుకి ఉన్న అనుమానమే నాకూ ఉంది. రుషికొండపై అక్రమంగా ఇల్లు కట్టుకున్న వ్యక్తిని మంత్రులు భగవంతుడితో పోల్చడం విడ్డూరంగా ఉంది. రుషికొండపై నిర్మించింది సీఎం నివాస భవన సముదాయం కాదని జగన్ నిరూపించాలి. సీఎం జగన్ టూరిజం కాటేజీల ముసుగులో కొత్త కాపురం కోసం నిర్మించుకున్న భవనాన్ని కూల్చివేయాలి. కొత్తగా ఏర్పడనున్న ప్రభుత్వం ఈ బాధ్యత తీసుకోవాలి. టీడీపీ అధినేత, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై దాడిచేసి హత్య చేయాలని చూసి, విఫలం కావడంతో ఆయనతో పాటు, మరో 300 మందిపై మూకుమ్మడిగా పోలీసు వ్యవస్థ ఐపీసీ 307 సెక్షన్ కింద హత్యాయత్నం కేసు నమోదు చేయడాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్, తనపై కూడా పోలీసులు చిలిపి, చిల్లర కేసులు పెడతారని గ్రహించి దానికి సంసిద్ధులైనట్లే కనిపిస్తున్నారు. షర్మిల.. జగన్మోహన్‌రెడ్డి విడిచిన బాణం… వైసీపీకే తగిలే అవకాశం కనిపిస్తోంది. షర్మిల తన పార్టీని కాంగ్రె స్‌లో విలీనం చేస్తే… దాని ప్రభావం వైసీపీపైనే తీవ్రంగా ఉంటుంది..
కలియుగానికి ముందు, శతాబ్దాల క్రితం వెలిసిన తిరుమలలో ఎప్పుడూ జరగని దుర్ఘటన ఇప్పుడు జరిగింది. ఇటీవల టీటీడీ చైర్మన్ పదవీ ప్రమాణ స్వీకారం అనంతరం ఈ తరహా ఘటన చోటు చేసుకోవడం పరిశీలిస్తే… ఏదో అపరాధం జరిగితేనే ఇటువంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటాయన్న పెద్దల మాటలు గుర్తుకు వస్తుంది’’ అని రఘురామ అన్నారు