సన్ పిక్చర్స్ బ్యానర్ లో 10-08-2023న రిలీజ్ అయిన ఈ జైలర్ (jailer movie telugu) చిత్రంలో (Rajinikanth) రజినీకాంత్, మోహన్ లాల్ (mohanlal), జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్ (sivarajkumar), నాగబాబు (nagababu), తమన్నా భాటియా (tamannah bhatia), సునీల్, రమ్యకృష్ణ (ramyakrishna), వినాయకన్, మిర్నా మీనన్, వసంత్ రవి, యోగిబాబు (yogibabu) తదితరులు నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్, ఎడిటింగ్: ఆర్ నిర్మల్, సినిమాటోగ్రఫి: విజయ్ కార్తీక్ కన్నన్, నిర్మాత: కళానిధి మారన్, దర్శకత్వం: నెల్సన్ దిలీప్ కుమార్ (nelson dileep kumar).
రజినీకాంత్ సినిమా అంటే తమిళంతో పాటు తెలుగులోనూ మంచి అంచనాలుంటాయి. తాజాగా నెల్సన్ తెరకెక్కించిన జైలర్‌తో మరోసారి ఆడియన్స్ ముందుకొచ్చారు సూపర్ స్టార్. మరి ఈ సారైనా అంచనాలు అందుకున్నారా..? జైలర్ ఎలా ఉన్నాడు..? మన ప్రేక్షకులకు నచ్చుతాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ గురించి చెప్పాలంటే.. :
ముత్తు (రజినీకాంత్) రిటైరైన పోలీస్ అధికారి. ఆయన కొడుకు అర్జున్ (వసంత్ రవి) తండ్రి బాటలో పోలీస్ అవుతాడు. అతను ఒక విగ్రహాల రాకెట్ ను ఛేదించే క్రమంలో పెద్ద మాఫియాతో పెట్టుకుని కనిపించకుండా పోతాడు. అర్జున్ చనిపోయాడన్న సమాచారంతో హతాశుడైన ముత్తు.. అతడి చావుకు కారణమైన వారిలో ఒక్కక్కరిని మట్టుబెట్టడం మొదలుపెడతాడు. ఈ క్రమంలోనే ముత్తు ఎంత పవర్ ఫుల్ అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఐతే విగ్రహాల మాఫియా ముత్తుకు భయపడి.. అర్జున్ చనిపోలేదని.. తమ దగ్గరే బందీగా ఉన్నాడని వెల్లడిస్తుంది. అతను ప్రాణాలతో బయటికి రాావాలంటే అత్యంత విలువైన ఒక కిరీటాన్ని తెచ్చి తమకు ఇవ్వాలని ముత్తుకు కండిషన్ పెడుతుంది. ఈ స్థితిలో ముత్తు ఏం చేశాడు.. కొడుకును ఎలా కాపాడుకున్నాడు.. చివరికి ఏమైంది అన్నది మిగతా కథ.
జైలర్ మూవీ ఎలా ఉందంటే ?
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా మొదలవుతుంది. 40 నిమిషాల పాటు సినిమా స్లోగా నడుస్తుండటంతో రజనీకాంత్ సినిమా మళ్లీ ఫ్లాప్ అవుతుందా అని అభిమానులు భయపడ్డారు. అయితే అప్పటి నుంచి అసలు సినిమా మొదలవుతుంది. నెల్సన్ మార్క్ కామెడీ కొన్ని చోట్ల పేలింది. ఫస్ట్ హాఫ్ లో రెండు మూడు ఎక్సయిటింగ్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్లాక్ ప్రేక్షకుల మైండ్‌ని ఉర్రూతలూగించింది.
ఓవరాల్‌గా, ఫస్ట్ హాఫ్ మొత్తం ఓ రేంజ్ ఇంటర్వెల్‌తో డీసెంట్‌గా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్ స్టార్ రజనీకాంత్ చుట్టూనే తిరుగుతుంది. ఆయన మార్క్ మ్యానరిజం, హీరోయిజం అభిమానులకు కన్నుల పండువగా నిలుస్తాయని చెప్పొచ్చు. కానీ ఫస్ట్ హాఫ్‌లో ఎక్కడా టీజర్‌లో, ట్రైలర్‌లో చూపించిన ప్రధాన పాత్రలు మనకు కనిపించవు. తమన్నా, మోహన్‌లాల్, సునీల్ తదితరులు ఫస్ట్ హాఫ్‌లో కనిపించరు.
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఫస్ట్ హాఫ్ లో కేవలం రెండు నిమిషాలు మాత్రమే కనిపిస్తాడు. ద్వితీయార్థం ప్రారంభం నుంచే రజనీకాంత్ విశ్వరూపం మొదలవుతుంది. మొదటి 20 నిమిషాల్లో జైలు సన్నివేశాలు, రజనీకాంత్ వ్యవహారశైలి, డైలాగ్స్ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఇన్ని రోజులు సూపర్ స్టార్ నుంచి ఇదే కోరుకున్నామని అందరూ అనుకుంటున్నారు.
దర్శకుడు నెల్సన్ ఆ రేంజ్ లో సీన్స్ రాసుకున్నాడు. ఈ సినిమా చూసి చాలా కాలం తర్వాత రజనీకాంత్‌ని ఓ దర్శకుడు అద్భుతంగా వాడుకున్నాడని అందరూ భావిస్తున్నారు. మిగతా నటీనటులందరూ తమ పరిధి మేరకు నటించారు. అనిరుధ్ నేపథ్య సంగీతం, ఆయన పాటలు ఈ చిత్రానికి వెన్నెముకగా నిలిచాయి.
ఫైనల్ గా చెప్పాలంటే..
జైలర్ చిత్రం రజినీకాంత్ మార్క్ మాస్ యాక్షన్ డ్రామా.
రేటింగ్ : 3/5