Sunday, December 22, 2024
spot_img
HomeNewsతెలంగాణ వ్యాప్తం గా భారీ వర్షాలు ... తొలకరి వ్యవసాయం మొదలు ...

తెలంగాణ వ్యాప్తం గా భారీ వర్షాలు … తొలకరి వ్యవసాయం మొదలు …

 తెలంగాణలో ఈరోజు , రేపు అనేక చోట్ల తేలిక నుంచీ భారీ లేదా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు . ఇక హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వర్షాలు పడుతున్నాయి. దీనితో తెలంగాణలో 5 జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించారు. అలాగే రాష్ట్రంలో 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించారు.

ఇక భాగ్యనగరాన్నీ మూడు రోజులుగా ముసురు తగులుకొంది . . అల్పపీడనం ప్రభావంతో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారుల నుంచీ సమాచారం . 30 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన .

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయపనులు జోరుగా మొదలయ్యాయి . ఎగువన కురుస్తున్న వర్షాలకు కడెం ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. కడెం ప్రాజెక్టు మొత్తం నీటి మట్టం 700ల అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 688.625 అడుగులకు చేరింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments