Sunday, December 22, 2024
spot_img
HomeCinemaప్రభాస్‌ 'ఆది పురుష్‌' టీజర్‌ రివ్యూ

ప్రభాస్‌ ‘ఆది పురుష్‌’ టీజర్‌ రివ్యూ

ఓం రౌత్‌ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాను రామాయణం ఇతివృత్తంగా తీర్చిదిద్దుతున్నారు. ‘ఆదిపురుష్‌’ టీజర్‌ను Adhipurush Teaser దసరా కానుకగా ఆదివారం అయోధ్య వేదికగా విడుదల చేసారు.

ఇక ఈ టీజర్ ఎలా ఉందంటే… 1.40 నిమిషాల పాటు సాగే టీజర్‌ Adhipurush Teaser ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. రాముడిగా ప్రభాస్ కనిపించిన తీరు చాలా బాగుంది. ముఖ్యంగా నీళ్లలో తపస్సు చేస్తూ కూర్చున్న షాట్ టీజర్‌కే హైలైట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. టీజర్‌లో కనిపించిన విజువల్స్‌ చూస్తుంటే సినిమాను అద్భుతమైన విజువల్ వండర్‌గా తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

రామసేతుపై రాముడిగా ప్రభాస్ నడుచుకుంటూ వచ్చిన సీన్, లంకేశ్‌గా సైఫ్ అలీఖాన్ క్రూరత్వం, రాక్షసులను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. సీత పాత్రలో నటించిన కృతిసనన్‌తో పూల తోటలో ఊయలలూగే షాట్ కలర్ పుల్‌గా ఉంది. హనుమంతుడిగా దేవదత్త నాగే, లక్ష్మణుడిగా సన్నీసింగ్ అదరగొట్టారు. సాచేత్‌ తాండన్‌- పరంపరా ఠాకూర్‌ నేపథ్య సంగీతం టీజర్‌కు Adhipurush Teaser మరింత వన్నె తెచ్చిందనే చెప్పాలి.

‘అధర్మం, అన్యాయం పదితలలుగా విలసిల్లుతున్న సమాజంలో న్యాయం రెండు పాదాలతో నడుచుకుంటూ రాముడు రూపంలో అధర్మాన్ని సంహరిస్తుంది’ అని డైరెక్టర్ ఓంరౌత్ ఈ చిత్రం ద్వారా చెప్పబోతున్నట్లు అర్థమవుతోంది. ఇందులో రామ-రావణ యుద్ధం ప్రేక్షకులకు కనువిందు చేయడం ఖాయం. హాలీవుడ్ స్థాయి సినిమా లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి Adhipurush Teaser. సంక్రాంతి కానుకగా 2023 జనవరిలో ‘ఆది పురుష్‌’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments