
పూనమ్ కౌర్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వం వహించిన మాయాజాలం చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. కథానాయికగా పెద్దగా పాపులారిటీ రాకపోయినప్పటికీ పలు చిత్రాల్లో హీరోయిన్ స్నేహితురాలిగా నటించింది. అయితే పూనమ్ కౌర్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కంటే సోషల్ మీడియా ద్వారా వివాదాల్లో నిలిచి పెద్ద ఎత్తున పేరు తెచ్చుకుంది.
ప్రకటన
సోషల్ మీడియా వేదికలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే తాను ఓ అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించడమే కాకుండా దానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది. తాను ఫైబ్రోమైయాల్జియాతో బాధపడుతున్నట్లు పూనమ్ కౌర్ సోషల్ మీడియాలో వెల్లడించింది.
ఈ వ్యాధి కారణంగా త్వరగా అలసిపోవడమే కాకుండా నీరసం, నిద్రలేమితో బాధపడటం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, మానసిక సమస్యలు, తీవ్రమైన కండరాల నొప్పులు వంటివి కూడా నమోదవుతున్నాయి. గత రెండేళ్లుగా ఈ వ్యాధితో బాధపడుతున్నానని, ఈ వ్యాధికి చికిత్స పొందుతున్నానని చెప్పింది. అయితే ప్రస్తుతం తాను కేరళలో ఆయుర్వేద చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. అయితే గత కొన్ని రోజులుగా సమంత కూడా తాను మైయోసైటిస్ వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పింది. ఈ వ్యాధి లక్షణాలు కూడా ఇలాగే ఉన్నాయని సమంత వెల్లడించింది. ఈ క్రమంలో సమంత లాగే పూనమ్ కూడా ఇలాంటి వ్యాధితో బాధపడుతోందని తెలిసి అభిమానులు షాక్ అవుతున్నారు.