బుధ అష్టమి అనునది అతి పవిత్రమైనదిగా మన శాస్త్రాలు చెపుతున్నాయి …
ఈ అష్టమి అనగా 8 వ తిథి , శుక్ల పక్షమున గాని , కృష్ణ పక్షమున గాని , బుధవారము నాడు వచ్చినచో ఆ అష్టమిని “బుధాష్టమి” అని అంటారు.
ఈ బుధాష్టమి పరమ శివుని పూజకు , అమ్మ పార్వతి దేవి పూజకు మిక్కిలి శ్ఱేష్టము.మన హిందూ శాస్త్రం ప్రకారము , ఎవరైతే ఈ బుధాష్టమి నాడు ఉపవాసము ఉండి ,శివపార్వతులను పూజిస్తారో ,వారి మరణానంతరం నరకమునకు పోక స్వర్గలోక ప్రాప్తి పొందుతారు అని శాస్త్రాలు చెపుతున్నాయి .
ఈ బుధాష్టమి వ్రతము చేసిన వారు స్వచ్చమైన పుణ్య జీవితమును పొంది తమ జీవితాంతం సర్వాభిష్టాలు పొందుతారు.
బుధాష్టమి వ్రత విధానము ..
ఈ బుదాష్టమి నాడు భక్తులు నవగ్రహాలలో ఒకడైన బుదుడిని ఆరాదించి , ఆయన అనుగ్రహమును పొందుతారు.
ఈ రోజు భక్తులు ఉపవాసముండి బుదుడికి ప్రత్యేక ప్రసాదాలను నివేదిస్తారు .
వ్రతము అయినా తరువాత ఆ ప్రసాదమును మాత్రమే తీసుకోవాలి
ఈ వ్రతమునకై బుధ విగ్రహము కానీ , బంగారు , వెండి కాసులో చిత్రీకరీంచిన బుధరూప కాసు ను కానీ , ఉపయోగించెదరు.
ఈ బుధుడి ముందు నీటితో నింపిన కలశమును పెట్టి కొబ్బరి బోండామును ప్రతిష్టించెదరు.
భక్తి పారవశ్యముతో బుధుడికి వివిధ పూజలను చేసి , ఆ నైవేద్య ప్రసాదమును అందరికీ పంచి ఇస్తారు.
ఈ వ్రతము ఆచరించిన వారు క్రమం తప్పకుండ 8 మార్లు ఆచరించవలెను.
ఈ విధముగా ఆచరించిన తరువాత , కడపటి బుధాష్టమి నాడు నీరు పేదలకు భోజనాలు పెట్టి , తోచిన వస్త్ర దానం చేయవలెను.
వారికి నెలకు సరిపడ బియ్యం , నూనె , పప్పులు దానము చేయవలెను , ఈ విధముగా బుధ అష్టమి వ్రతమును చేసిన వారికి , సకల దోషములు తోలగి , పుణ్యం లభించి నరక లోకమునకు పోక స్వర్గ లోక ప్రాప్తి పొందుతారు.
కొందరు ఈ దినమున శివ పార్వతులకు పూజలు కూడా నిర్వహిస్తారు.
ఈ బుధాష్టమి యొక్క విశిష్టత బ్రహ్మాండ పురాణము నందు వివరింప బడివున్నది.
ఈ వ్రతం చేసిన వారికి ప్రస్తుత , పూర్వ , జన్మ పాపముల నుండి విముక్తి లభించును.
శివ , పార్వతి ఆరాధన ఈ బుధాష్టమి నాడు చేసిన అంతటి ఫలితం లభించును.
ఈ వ్రతమాచరించిన వారికి బుధ గ్రహ దోషములు నివారింపబడి , బుధ గ్రహ బాధలనుండి విముక్తి లభించును.
శ్రీ బుధ స్తోత్రం
ధ్యానం |
భుజైశ్చతుర్భిర్వరదాభయాసి-
గదా వహంతం సుముఖం ప్రశాంతమ్ |
పీతప్రభం చంద్రసుతం సురేఢ్యం
సింహే నిషణ్ణం బుధమాశ్రయామి ||
నేటి ‘బుధాష్టమి’ – స్నాన, దానాదులు అక్షయ ఫలప్రదములు.