ఆపరేషన్ K
అసెంబ్లీలో తొలి రోజే కెసిఆర్ కి సీఎం రేవంత్ దెబ్బ..?
నేటి నుంచి తెలంగాణాలో బడ్జెట్ సమావేశాలు
అధికార, విపక్షాల మధ్య వాడీవేడీ చర్చకు అవకాశం
ప్రతిపక్ష హోదాలో తొలిసారిగా సభకు కేసీఆర్
తెలంగాణాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండడం..
ఈ సభలో నీటి ప్రాజెక్టుల వివాదం చర్చకు రానుండటంతో.. ఈసారి సభ అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాడీవేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీలో తొలి రోజే గులాబీ బాస్ కెసిఆర్ కి సీఎం రేవంత్ రెడ్డి దెబ్బ కొట్టాలి అనే క్రమంలో, కాంగ్రెస్ ప్రభుత్వం గత పదేళ్లలో కెసిఆర్ తప్పులను బయటపెట్టి గులాబీ నేతల నోటికి తాళం వేయనున్నారనే ప్రచారం జరుగుతుంది.
దీంతో అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలనున్నట్లు తెలుస్తుంది. ఇవ్వాళ ముందుగా ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభలు చర్చించి ఆమోదించనున్నారు. 10న రాష్ట్ర వార్షిక బడ్జెట్ ప్రవేశపెడుతారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. తెలంగాణా అసెంబ్లీ ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు నాలుగురోజులు జరగవచ్చని సమాచారం.
తాత్కాలిక బడ్జెట్ ఓకే చేయించటమే ముఖ్యం కావున అది అవగానే సభను వాయిదా వేసేస్తారు. ఆ తదుపరి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవటానికి అధికార కాంగ్రెస్ ఒకవైపు విపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు మరొకవైపు రెడీ ఉన్నారు.
ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకత ఏమిటంటే కేసీయార్ కూడా పాల్గొంటున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ నేతగా గులాబీ దళపతి కేసీయార్ ఎంపికయ్యారు. ఈరోజు నుండి మొదలవుతున్న సమావేశాలకు కేసీయార్ కూడా హాజరు అవుతున్నారు.
*ముఖ్యంగా గత పదేళ్ల బఆర్ఎస్ పాలనలో చేసిన బారి స్కామ్స్&
కాళేశ్వరం ప్రాజెక్టు
మేడిగడ్డ బ్యారేజి నాణ్యత లేని నిర్మాణం
ధరణి పోర్టల్లో బయటకి వస్తున్న అక్రమాలు
మిషన్ భగీరథలో కోట్లరూపాయల అవినీతి ఆరోపణలు
పలు సంస్ధలలో చేసిన వేలకోట్ల రూపాయల అప్పులు
ఇలా వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అనే అబద్ధపు ప్రచారాల్లాంటి అనేక అంశాలను అసెంబ్లీలో బయటపెట్టేందుకు రేవంత్ రెడ్డి టీం సిద్ధమయ్యారు.
కెసిఆర్ చేసిన వైఫల్యాలను అసెంబ్లీ సాక్షిగా ఎత్తి చూపించి, ఉభయ రాష్ట్రాలు కలిసిఉన్నపుడు కంటే ఈ పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు కెసిఆర్ చేసిన అన్యాయం పై సీఎం రేవంత్ బిఆర్ఎస్ ను టార్గెట్ చేయనున్నట్లు సమాచారం
కాంగ్రెస్ దాడిని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ కూడా సై అంటే సై అనేలా కాంగ్రెస్ ని డీ కొట్టేలా గులాబీ టీం సిద్ధంగా ఉందని సమాచారం.
అయితే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీలను అమలు చేయడం లేదని విపక్షాలు ఒక వైపు విమర్శలు గుప్పిస్తుండటం..
మరోవైపు.. గత పదేళ్ల అవకతవకలను బయటపెట్టి ప్రతిపక్ష బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టాలని అధికారపక్షం చూస్తుంది. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఎవరు పై చేయి సాధిస్తారనేది ఆసక్తిగా మారింది.
కేసీఆర్ కుటుంబం భారీగా అవినీతికి పాల్పడిందంటూ ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ..
నిజానిజాలు బయటపెట్టే పనిలో మొదట విద్యుత్ శాఖ, రాష్ట్ర ఆర్థికశాఖ పరిస్థితిపై ఫోకస్ పెట్టి లెక్కలన్నీ తీసి మొదటి అసెంబ్లీ సమావేశంలోనే శ్వేత పత్రం విడుదల చేసిన సంగతి మీ అందరికి తెలిసిందే ,నేడు జరగబోయే బడ్జెట్ సమావేశాల్లో, కాళేశ్వరం ప్రాజెక్టు ,మేడిగడ్డ బ్యారేజి , ధరణిపోర్టల్ ,పలు సంస్థల్లో అప్పులు సహా రాష్ట్రంలోని ప్రాజెక్టుల అన్నిటి పై శ్వేత పత్రం విడుదల చేయనున్నట్టు తెలుస్తుంది .
చట్టం తనపని తాను తానూ చేసే క్రమంలో ఆపరేషన్ కే మాత్రం గులాబీ దళపతిని ఎక్కడికో తీసుకువెళ్తుంది అని రేవంత్ రెడ్డి అన్నారు .