Saturday, August 13, 2022
spot_img
HomeNewsAndhra Pradeshనేడు మరాఠా .. రేపు తెలంగాణా ..ఆపై ఆంధ్రా.. డర్టీ పాలిటిక్స్ !!

నేడు మరాఠా .. రేపు తెలంగాణా ..ఆపై ఆంధ్రా.. డర్టీ పాలిటిక్స్ !!

నేడు మరాఠా .. రేపు తెలంగాణా ..ఆపై ఆంధ్రా.. డర్టీ పాలిటిక్స్ !!

మహారాష్ట్ర రాజకీయాల్లో శివసేన అధినేత ముఖ్యమంత్రి ఉద్దవ్ ధాకరేను పార్టీ ఎమ్మెల్యేలు పూర్తిగా విడిచి పెట్టేయడం, తిరుగుబాటు జెండా ఎగరెయ్యడం .. దానికోసం వారు చెప్పిన కారణాలు చూస్తే.. ఇక్కడ తెలంగాణలోనూ అచ్చం అలాంటి పోలికలే ఉన్నాయని అందరికీ అనిపించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ..

ముఖ్యమంత్రి తమకి అపాయింట్‌మెంట్లు ఇవ్వడంలేదని.. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని.. కేవలం ఇతరులకే అక్కడ ప్రాధాన్యం లభిస్తోందని .. అందుకే శివసైనికులం అవమానంగా భావిస్తున్నాం అని శివసేన రెబెల్ ఎమ్మెల్యేలు అంటున్నారు… ఇప్పుడు అసలు సంగతి అర్ధమయ్యిందా .. మన తెలుగురాష్ట్రాల్లో అచ్చంగా అదే పరిస్థితి ఉంది.

తెలంగాణాలో కేసీఆర్ కోరుకుంటే తప్ప.. ప్రగతి భవన్‌లోకి ఎవరికీ అపాయింట్మెంట్ ఉండదు. ఈటల రాజేందర్ తాము ఎన్ని సార్లు అవమానాలకు గురయ్యామో పార్టీ నుంచి గెంటేసిన తర్వాత అందరికీ చెప్పుకున్నారు. ఆఖరికి పార్టీలో కీలకమైన హరీష్ రావు, గంగుల కమలాకర్‌ లకి కూడా అదే పరిస్థితి వచ్చిందని చెప్పారు.

నిజానికి టీఆర్ఎస్‌లో మెజార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్‌మెంట్ దొరకడం చాలా కష్టం. వాళ్ళని కేవలం కేసీఆర్ కలవాలనుకుంటే మాత్రమేకలుస్తారు లేదంటే నో ఎంట్రీ . ఇలాంటి పరిస్థితుల్లో సహజంగానేపార్టీ నేతల్లో అసంతృప్తిఉంది. ఇక నిధుల విషయంలోనూ ఎమ్మెల్యేల అసంతృప్తి చాలా సార్లు బయటపడింది. పార్టీ నాయకులేక బిల్లులు రావడం లేదన్న ఆగ్రహం కూడా కనిపిస్తోంది.

ఇక ఆంధ్రా సంగతి చూస్తే .. పెద్దగా తేడా ఏంలేదు.. ఎమ్మెల్యేలకు కాదు కదా మినిస్టర్లకు కూడా సీఎం జగన్ అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం .. ఇక ముఖ్యమంత్రి సరేసరి .. ప్రజల్లోకి వెళ్లే ఆలోచనే లేదు అసలు . .వెళ్లినా చుటూ పరదాలు ఉండాల్సిందే .. మంది వెనుక రావాల్సిందే … ప్రజల్లోకి వెళ్లాలంటే అంత భయం ఎందుకో అర్ధం కాదు .. కాకపోతే ఒక ప్లస్ పాయింటు .. మరాఠా తరహా ఆంధ్రాలో జరిగేది కష్టమే .. ఎందుకంటే మోడీ సర్కార్ కి సాష్టాంగం పెట్టేస్తే సేఫ్ అనే స్థితికి వచ్చేసారు కాబట్టి .. ఎటొచ్చీ తెలంగాణాలో మాత్రమే మహారాష్ట్ర తరహా రాజకీయ పరిస్థితి ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంది

అందువల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలను కనుక బీజేపీ టార్గెట్ చేస్తే.. వారివలలో సులువుగా చిక్కుకుంటారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. అయితే మహారాష్ట్రలో బీజేపీకి కొంత బలం ఉంది. శివసేన ఎమ్మెల్యేలను చీల్చితే… బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. తెలంగాణలో అలాంటి పరిస్థితిలేదు. ఏం చేసినా బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు. అదే సమయంలో కేసీఆర్‌ను కాదని పార్టీని చీల్చే నాయకులు కొద్దిమందే ఉన్నారు. వారుతిరుగుబాటు చేస్తారో లేదో చెప్పడం కష్టం. కానీ ప్రజల్లో కనిపిస్తున్న అసంతృప్తిని బీజేపీ ఉపయోగించుకోదల్చుకుంటే… మహారాష్ట్ర రాజకీయాలు… తెలంగాణలో చూసినా ఆశ్చర్యం లేదని కొంత మంది వాదన వినిపిస్తున్నారు. రాజకీయాల్లో ఏదీ అసాధ్యం కాదు.. ఎందుకంటే ధాకరే ఫ్యామిలీనే ఎమ్మెల్యేలు వద్దనుకుంటారని ఎవరూ ఊహించలేదు మరి ! పాతకొత్తములారా…ఏమంటారు.. ఈ ఆపరేషన్ డర్టీ పాలిటిక్స్ ఎక్కడిదాక వెళుతుంది??

RELATED ARTICLES

Most Popular

Recent Comments