కేవీపీ రామచంద్ర రావు ఇటీవల ఒక పుస్తకావిష్కరణలో చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలనెదుర్కొంటోంది . తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పరం గా ఎవరూ కేవీపీ వ్యాఖ్యలను సమర్ధించలేదు . రేవంత్ రెడ్డి , హనుమంత్ రావు లు ఆయనను విమర్శించినా సంగతి తెలిసిందే . ఇక అధికార భారాసా లో కూడా ఆయనపై ఎదురుదాడి మొదలైంది .
‘రైతే రాజు పుస్తకం ఆవిష్కరణలో కేవీపీ రామచంద్ర రావు (KVP. Ramachandra Rao) తెలంగాణ మట్టిలో కలిసి పోతానని మాట్లాడారు. తెలంగాణను వ్యతిరేకించి మళ్లీ ఇక్కడ ఆధిపత్యం చేసేందుకు ప్రయత్నాలు. సమైక్య వాదుల కబంధ హస్తాల్లోకి తెలంగాణ పోవద్దు. హైదరాబాద్‌లోనే ఉంటాం.. తెలంగాణకు ద్రోహం, కుట్రలు చేస్తామంటే సహించరు. తెలంగాణపై దండయాత్రలా కేవీపీ, షర్మిల వ్యాఖ్యలు. జమిలి ఎన్నికలు సాధ్యం కాదనేది అందరికీ తెలుసు.’’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు .
కేవీపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కేవీపీ చేసిన కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విభజన వద్దని ప్లకార్డులు పట్టుకున్నప్పుడు కేవీపీకి తెలంగాణ గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు వీహెచ్. ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉందని.. కాబట్టి కేవీపీ ఏపీ వెళ్లి పని చేస్తే బెటర్ అని సూచించారు.