Saturday, December 21, 2024
spot_img
HomeNewsAndhra Pradeshరెండో రోజు భువనేశ్వరి 'నిజం గెలవాలి' పర్యటన.. తిరుపతి జిల్లా లో

రెండో రోజు భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ పర్యటన.. తిరుపతి జిల్లా లో

Chittor: చంద్రబాబునాయుడు అక్రమ అరెస్ట్ తదుపరి రాష్ట్రవ్యాప్తం గా ఆయన అభిమానులు , తెదేపా సానుభూతి పరులు చనిపోయిన సంగతి తెలిసిందే . వారిని పరామర్శించి, ఆర్ధిక , మానసిక స్వాంతన కలిగే విధం గా “నిజం గెలవాలి” పేరుతొ నారా భువనేశ్వరిగారు నిన్నటి నుంచీ చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు .

నేడు శ్రీకాళహస్తి , చిత్తూరు నియోజకవర్గాల్లో పర్యటించారు . తంగళ్ల పాలెం లో మరణించిన మోడెం వెంకట రమణ కుటుంబాన్ని పరామర్శించారు . కొనతనేరి లో గాలి సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించారు . కాసారం లో వేంకట సుబ్బయ్య కుటుంబాన్ని పరామర్శించారు . ఆయా కుటుంబాలకు 3 లక్షల రూపాయల ఆర్ధిక సాయం చెక్కు ద్వారా అందించారు .

నిజం గెలవాలి పై సినీ దిగ్గజం రాఘవేందరరావు మాట్లాడుతూ , స్పందన చూస్తుంటే నిజం నిజమ్ గానే గెలుస్తుందనిపిస్తుందన్నారు . నిజాం గెలిచి ప్రజా విజయభేరి త్వరలోనే మ్రోగించడం ఖాయం అన్నారు . చంద్రబాబు అరెస్ట్ పై ప్రపంచ వ్యాప్తం గా ఆగ్రహ జ్వాలలు వీస్తున్నాయన్నారు . ఇక ప్రజా వ్యతిరేక అరాచకాలకు అంతిమ ఘట్టం ” నిజం గెలవాలి” అన్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీ దత్ .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments