Friday, September 13, 2024
spot_img
HomeNewsAndhra Pradeshనారాలోకేష్ యువగళం ..కృష్ణా జిల్లా లోకి ...గ్రాండ్ ఎంట్రీ.. కేశినేని చిన్ని మార్క్

నారాలోకేష్ యువగళం ..కృష్ణా జిల్లా లోకి …గ్రాండ్ ఎంట్రీ.. కేశినేని చిన్ని మార్క్

ప్రకాశం బ్యారేజీ మధ్యలో నారా లోకేష్‌కి ఉమ్మడి గుంటూరు జిల్లా నేతలు ఘనంగా వీడ్కోలు పలుకగా నిన్న ప్రకాశం బ్యారేజ్ మీదుగా కృష్ణా జిల్లాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు . కృష్ణాజిల్లా నేతలు లోకేష్‌కు ఘన స్వాగతం పలికారు. భారీ గజమాలలతో లోకేష్‌ని సత్కరించారు. ఆశేష జనవాహిని మధ్య లోకేష్ విజయవాడలోకి అడుగుపెట్టారు. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో కార్యకర్తలు పాదయాత్ర దారి అంతా పసుపు మాయం చేశారు . బ్యారేజీ రోడ్లన్నీ పసుపు సముద్రంలా మారాయి. బంతి పూల జనవనం. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఎక్కడ చూసినా జనం.   పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల నడుమ కేరింతలు కొట్టారు. బాణాసంచా మోతలు, నినాదాలతో ప్రకాశం బ్యారేజీ పరిసరాలు హోరెత్తాయి. భారీ గజమాలలు, పూలవర్షంతో యువనేత నారా లోకేష బాబు ను అభిమానులు ముంచెత్తారు. టీడీపీ నేతలు కేశినేని చిన్ని, బుద్దా వెంకన్న దగ్గరుండి ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడలో లోకేశ్ పాదయాత్రను గ్రాండ్ సక్సెస్‌ చేసే బాధ్యతను చంద్రబాబు ప్రత్యేకంగా కేశినేని చిన్నికి అప్పగించగా చిన్ని తన స్టామినాను నిరూపించుకొనేలా ఈ ఏర్పాట్లు చేశారు. విజయవాడ అంతటా కేశినేని చిన్ని పేరు వినిపించడం విశేషం .

అభిమానులందరూ కోరుకొన్న సన్నివేశం ఒకటి జరిగింది .. అదే పాదయాత్రలో వంగవీటి రాధాకృష్ణ వచ్చి నారా లోకేష్ బాబు ను కలిసి ఆప్యాయం గా ఆలింగనం చేసుకొన్నారు . ఇద్దరూ చేతిలో చేయు వేసుకొని అభిమానుల కేరింతల మధ్య అడుగులు వేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యుంది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో లోకేశ్ పాదయాత్ర మొత్తం ఆరు రోజుల పాటు జరగనుంది. ఈ జిల్లాలో 6 నియోజకవర్గాలను లోకేష్ కవర్ చేయనున్నారు. విజయవాడ సిటీలో సెంట్రల్, ఈస్ట్, వెస్ట్ , పెనమలూరు , గన్నవరం లలో పాదయాత్ర సాగనుంది లోకేశ్ పాదయాత్రలో అలజడికి వైసీపీ ప్లాన్ చేసిందని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఇప్పటికే ఆరోపించారు. తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా దేవినేని అవినాశ్ ఇంటికి వెళ్లి చర్చించడం ఇందులో భాగమేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గన్నవరం సభలో అల్లర్లు సృష్టించడానికే జగన్ అవినాష్ ఇంటికి వెళ్లారని తెలుగుదేశం ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే .

22 వ తేదీన గన్నవరం లో కానీ వినీ ఎరుగని రీతిలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జారుతున్నాయి . ఈ సభా పర్యవేక్షణ, ఏర్పాట్లు యరపతినేని శ్రీనివాసరావు , కొనకళ్ల నారాయణ సమీక్షిస్తున్నారు . ఈ సభలోనే యార్లగడ్డ వెంకటరావు వైకాపా మాజీ నియోజకవర్గ ఇంచార్జి పసుపు కండువా కప్పుకోనున్నారు .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments