Jangareddygudem: నారాలోకేష్ యువగళం “ప్రజాగళం ” గా పశ్చిమ గోదావరి జిల్లాలో సాగుతోంది . పాదయాత్ర 200వ రోజు జంగారెడ్డిగూడెం శివారు దండమూడి కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుండి ప్రారంభమైంది . అంతకు ముందు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అధ్వర్యంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగు మహిళలు రాఖీలు కట్టారు . వారి అందరికీ నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు . పాదయాత్ర 200 రోజులలో 2700 కిలోమీటర్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా తల్లి భువనేశ్వరి తో కలిసి శిలాఫలకం ఆవిష్కరించారు.
వివిధ గ్రామాల ప్రజలు వారి సమస్యలపై వినతిపత్రాలు అందించారు. కొయ్యలగూడెంలో గిరిజనులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో వారి సమస్యలు తెలుసుకున్నారు . టిడిపి అధికారంలోకి వచ్చాక అందరికీ అండగా ఉంటామని నారా లోకేష్ భరోసా ఇచ్ఛరు .
ఈ ఏడాది జనవరి 27న ప్రారంభమైన పాదయాత్ర ప్రభుత్వం సృష్టించిన ఎన్నో ఆటంకాలను ఎదుర్కుంటూ.. ప్రజల ఆశీర్వాదాలతో నేటికి 200వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా యువనేతకు టీడీపీ అధ్యిక్షులు చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. యువగళం ప్రజాగళం అయ్యింది అంటూ టీడీపీ అధినేత అభినందించారు.