Yuvagalam at Gannavaram: గన్నవరంలో యువగళం గర్జన.. పోటెత్తిన పసుపు దండు .. కిక్కిరిసిన సభా ప్రాంగణం..మహిళా లోకం కడలి వచ్చింది . తెదేపా నేతల ఉత్సాహపూరిత ప్రసంగాలు .
గన్నవరంలో యువగళం బహిరంగ సభకు టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా వచ్చారు. ఇక సభా ప్రాంగణమంతా తెలుగు తమ్ముళ్లతో కిక్కిరిసిపోవడంతో జాతీయ రహదారిపై నిలబడి ప్రజలు వీక్షించారు వేలాదిగా వచ్చిన టీడీపీ శేణులతో జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సభను టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తో సభకు భారీగా ప్రజలు తరలివస్తారని ఘనంగా ఏర్పాట్లు చేశారు. అంచనాలకు మించి ప్రజల నుంచి స్పందన రావటంతో.. వందలాది మంది ప్రజలు సభా ప్రాంగణం బయటే ఉండి పోయారు. ఎలా అయినా యువనేత లోకేశ్‌ను చూడాలని, ప్రసంగం వినాలని జనం ఆసక్తి చూపడం విశేషం . నారా లోకేశ్ సభా వేదికపైకి చేరుకునే సమయంలో.. కార్యకర్తలు ఉత్సాహంతో జై లోకేశ్.. జై చంద్రబాబు అంటూ నినాదాలు చేశారు. సభా వేదికపైకి చేరుకున్న లోకేశ్.. ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం చిన అవుటుపల్లి వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ . ‘త్వరలో మీ ఇంటికి వలంటీరు వస్తాడు. ఓ గొట్టం తెచ్చి ఊదమంటాడు. మీరు పొరపాటున ఊదితే అంతే సంగతులు. అమ్మో రోజూ ఇంత గాలి పీలిస్తున్నారా.. అంటూ పన్ను బాదేస్తాడు సైకో జగన్’.
టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక రూ.1,500 ఉంటే ఇప్పుడు అదే ఇసుక రూ.5 వేలు పలుకుతోందన్నారు. రోజుకు రూ.3 కోట్లు, నెలకు రూ.90 కోట్లు, ఐదేళ్లలో రూ.5,400 కోట్లు ఇసుక ద్వారా కొల్లగొట్టేందుకు జగన్ సిద్ధమయ్యారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఇసుక ధరలను తగ్గించి భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటాం.
నిన్న ఉద్యోగ సంఘాల సమావేశానికి వెళ్లిన జగన్.. మీ సంతోషం, మీ భవిష్యత్ నా బాధ్యత అన్నాడు. నేను ఆయన్ను ఒక్కటే అడుగుతున్నా.. ముందు ఒకటో తేదీన జీతాలు ఇవ్వు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగా సీపీఎస్ రద్దు చేయి. ఆ తర్వాత వారి సంతోషానికి.. భవిష్యత్‌కు బాధ్యత తీసుకుందువు! పోలీసులకు రావలసిన అలవెన్సులూ కట్ చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి 100 రోజుల్లోనే పోలీసుల అలవెన్సులకు సంబంధించిన జీవో 79 రద్దు చేస్తాం.
సన్న బియ్యం సన్నాసికి గుట్కా, పేకాట క్లబ్బులపై తప్ప ఏమీ అవగాహన లేదు. నా తల్లిని అసెంబ్లీ సాక్షిగా అవమానించాడు. త్వరలో అధికారంలోకి వచ్చేది మేమే. గుడివాడలో సన్న బియ్యం సన్నాసిని కట్ డ్రాయర్‌తో ఊరేగించే బాధ్యత లోకేశ్ తీసుకుంటాడు. ఇంకో తల్లిని అవమానించాలంటే ఉచ్చపోసేలా చేస్తాం. రాముడి తల నరికితే నవ్వుకున్నవాడికి దేవదాయ శాఖను అప్పగించారు. అతడు కొబ్బరి చిప్పలను దొంగలించుకుపోవడం తప్ప ఏమీ చేయలేదు. ఒక్క ఇల్లు కట్టలేని జోకర్ జోగి (మంత్రి జోగి రమేశ్).. చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడి చేస్తాడంట దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు రా! పుచ్చలపల్లి సుందరయ్య, దాసరి బాలవర్ధన్‌రావు లాంటి గొప్ప వ్యక్తులు గన్నవరంలో ఎమ్మెల్యేలుగా చేశారు. కానీ టీడీపీ చేసిన తప్పు వల్ల ఓ పిల్ల సైకో (వల్లభనేని వంశీ) ఎమ్మెల్యే అయ్యాడు. ఆ తప్పు మరోసారి చేయం. ఈ పిల్ల సైకో మహానటుడు. నేను మంత్రిగా ఉన్నప్పుడు నా చాంబర్‌కు వచ్చి సార్ సార్ అంటూ ఉండేవాడు. కూర్చోవయ్యా అంటే నిల్చొనే ఉండేవాడు. అలాంటి పిల్ల సైకో దేవాలయం లాంటి టీడీపీ ఆఫీసుపై దాడి చేసి తగులబెట్టాడు. ఆ పిల్ల సైకోకు భయాన్ని పరిచయం చేసి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే బాధ్యత నాది.
టీడీపీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటా. ఏ అధికారులైతే చట్టాలను ఉల్లంఘించి కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారో వారిపై జ్యుడీషియల్ విచారణ చేసి జైలుకు పంపుతా. నా వద్ద ఉన్న రెడ్ డైరీలో ఏ అధికారి చట్టాన్ని ఉల్లంఘించి టీడీపీ నాయకులు, కార్యకర్తలను వేధిస్తారో వారి పేరు రాసుకుంటున్నా. వారిపై తప్పకుండా చర్యలుంటాయ్. అన్నారు నారా లోకేష్ . ఏది ఏమైనా గన్నవరంలో జరిగిన యువగళం బహిరంగ సభకు భారీ స్పందన లభించింది.