నారా లోకేష్ బాబు యువగళం రాయలసీమలో మొదలై వైసీపీ కంచుకోటలలో తన సత్తాను చాటింది . జగన్మోహన రెడ్డి అడ్డాలో నారా లోకేష్ సంచలనాత్మక రాయసీమ డిక్లరేషన్ తో తాము అధికారం లోకి వస్తే ఏం రాయలసీమకు ఏం చేస్తామో స్పష్టత తో తెలియ చెప్పారు .
యువగళం పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే సీమ జిల్లా పట్టభద్రులు తెదేపా కు 4 జిల్లాల్లో 2 సీట్లలో అఖండ విజయాన్ని ఇచ్చి జన నాడి ఎలా ఉందొ తెలియచేసారు . సీమలో తెదేపా ను మరింత బలోపేతం చెయ్యడానికి అధినేత చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలనలో భాగం గా రాయసీమ పర్యటనకు శ్రీకారం చుట్టారు . ఈ పర్యటనలు జన సునామీ ను తలపిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు .ఐతే తెదేపా శ్రేణులు తొక్కిసలాటలు లేకుండా తగు జాగ్రత్తలు తీకుకోవాలి .
ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన లో భాగం గా 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన..తదుపరి అనంతపురం జిల్లాకు చంద్రబాబు వస్తారని తెలిపారు. 4న కళ్యాణదుర్గంలో బైరవానితిప్ప ప్రాజెక్టు, పేరూర్‌లో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారని సీనియర్ నాయకుడు కాల్వ శ్రీనివాసులు చెప్పారు . రాయలసీమ భవిష్యత్‌తో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని ఆయన విమర్శించారు. కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను సీఎం జగన్ ఆపేశారని ఆయన ఆరోపించారు.
సీమ జిల్లాల్లో నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన గతం లో జరిగిన పర్యటనలను మించి ప్రజాదరణ తో సాగుగుతుందనడం లో ఎలాంటి సందేహం లేదని పరిశీలకుల అంచనా !?