Sunday, December 22, 2024
spot_img
HomeNewsAndhra PradeshNTR Rs. 100 Coin విషయం లో మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారు...

NTR Rs. 100 Coin విషయం లో మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారు … నారా భువనేశ్వరి

KUPPAM: Naara Bhuvaneswari : సంజీవిని ఆసుపత్రి, మొబైల్ క్లినిక్‌ని మంగళగిరిలో లోకేష్ స్టార్ట్ చేశారు. కుప్పంలో స్టార్ట్ చేయాలనే ఆలోచన నాకు వచ్చింది. మాకు ప్రభుత్వంతో సంబంధం లేదు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని నారా భువనేశ్వరి తెలిపారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి , మరియు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు కుమార్తె నారా భువనేశ్వరి మంగళవారం చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. భారత ప్రభుత్వం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ఎన్టీఆర్ పేరు మీద వంద రూపాయల నాణెం విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇందుకు మా అక్క పురంధేశ్వరి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కుప్పంలో సంజీవిని ఆసుపత్రికి సొంత భవనం నిర్మిస్తామని చెప్పారు. కుప్పంలో ఇల్లు కట్టుకోవడం ఆలస్యమైంది.. ఇక్కడ ఇల్లు పూర్తయ్యాక కుటుంబంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటామని చెప్పారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments