ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు నిరసన గా తెదేపా పిలుమేరకు బంద్ జరుగుతోంది .
ఈరోజు బంద్ కు జనసేన , సిపిఐ , జైభీమ్ పార్టీ , వివిధ ప్రజా సంఘాలు , వాణిజ్య సంఘాలు సంఘీభావం తెలిపాయి .
ఏపీలో రాజకీయ సమీకరణాలు రెండు రోజుల్లో వేగంగా మారిపోయాయి
నారా లోకేష్ కు పవన్ కళ్యాణ్ ఫోన్ … సంఘీభావం తెలిపిన జనసేనాని
చంద్రబాబు ను పోలీస్ కస్టడీ కి ఇవ్వాలని AP CID పేషన్ వేసింది .
చంద్రబాబు కు ప్రాణహాని వుంది అని ప్రముఖ సుప్రీమ్ కోర్ట్ కౌన్సెల్ సిద్ధార్ధ లూద్ర అన్నారు .
చంద్రబాబు రిమాండ్ ను హౌస్ అరెస్ట్ గా మార్చాలని కోరతాం అన్నారు .
హౌస్ అరెస్ట్ పిటీషన్ పై వాదనలు వినిపిస్తాం అని సిద్ధార్ధ లూద్ర అన్నారు .
హైకోర్టు లో చంద్రబాబు బెయిల్ పిటిషన్ వేయనున్న సుప్రీమ్ కోర్ట్ కౌన్సెల్ సిద్ధార్ధ లూద్ర.
రాష్ట్ర వ్యాప్తం గా తెదేపా నాయకుల అరెస్టులు …
రోడ్డుపై బైఠాయించిన పరిటాల శ్రీరామ్ పలువురు కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పలువురికి గాయాలయ్యాయి. మహిళా కార్యకర్తలకు కూడా గాయాలయ్యాయి. టీడీపీ నాయకుల్ని ధర్మవరం పోలీస్ స్టేషన్‌కు,
పరిటాల సునీతా అరెస్ట్ ..రామగిరి పోలీస్ స్టేషన్ కు
చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ .. రాష్ట్రవ్యాప్తం గా తెదేపా శ్రేణుల రిలే నిరాహార దీక్షలు .
త్వరలో భువనేశ్వరి, బ్రాహ్మణి ప్రజల్లోకి వస్తారని వార్తలు …