Uttam Kumar Reddy: తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా వున్నాయి . ఇప్పటికే గులాబీ బాస్ 115 మంది MLA లకు అభ్యరధులను ప్రకటించి కాదనా రాగం లోకి దూకారు . ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం కోసం నాయకులు పోటెత్తారు . 1000 కు పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు . ఒక్కో స్థానానికి 5 నుంచీ 10 మందికి పైగా దరకాస్తు చేశారు . ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా లో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన సతీమణి కోదాడ, హుజుర్ నగర్ లకు దరఖాస్తు పెట్టారు . ఆ నియోజకవర్గాలకు వారివురూ గతం లో పోటీ చేశారు , ప్రాతినిధ్యం వహించారు .
ఈ సారి వారికి ఒక కుటుంబంలో రెండు స్థానాలు ఇస్తారా అనేది ప్రశ్న గా మారింది . ఐతే ఎంపీ ఉత్తమకుమార్ రెడ్డి తాము 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా రాజకీయంగా నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా గెలిచి తెలంగాణలో అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు , ప్రస్తుత నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కోదాడ, హుజుర్ నగర్ నియోజకవర్గాల నుంచి తాను, తన భార్య ఉత్తమ్ పద్మావతి పోటీ చేస్తున్నామని, ఈ నియోజకవర్గాలలో 50వేల మెజార్టీ తగ్గితే తాను పూర్తిగా రాజకీయాలను తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు.
తనకు పిల్లలు లేరని, ఈ రెండు నియోజకవర్గాల ప్రజలే తన పిల్లలని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్, బిజెపి లు తోడు దొంగల్లాగా వ్యవహరిస్తున్నారని ఉత్తమ్ర్ విమర్సించారు . నిజాలను నిర్భయం లేకుండా వార్తలు రాసే జర్నలిస్టులపై దాడులు చేస్తున్నారు , అక్రమ కేసులను బనాయిస్తున్నారన్నారు . తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు . ఇంకా విద్యావ్యవస్థకు తీరని అన్యాయం చేసి , యూనివర్సిటీలో నిర్వీర్యం చేస్తున్నారు, వేలాది అధ్యాపక పోస్టులు పెండింగ్లో ఉంటే ఇప్పటివరకు ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదన్నారు .
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు చెప్పాయనీ , ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కి బ్రహ్మరథం పడుతున్నారన్నారు. తాము వచ్చే ఎన్నికల్లో అధికార పగ్గాలను చేపడితే నిరుద్యోగ యువతను ఆదుకుంటామని, అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే నిరుద్యోగులకు 4000 రూపాయల నిరుద్యోగ భృతి అందిస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. కోదాడ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించారు .