ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా .. ఏదో ఒక కొత్త విషయాన్ని తెరపైకి తీసుకువస్తుంటారు . నిన్నటి మన్ కీ బాత్ లో మేరీ మాటీ మేరా దేశ్ అనే సరికొత్త కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తామని మోడీ తెలిపారు. మన్ కీ బాత్.. అమర వీరుల గౌరవార్థం నిర్వహించే కార్యక్రమం. ఇందులో చాలా అంశాలు కీలకంగా ఉన్నాయి. ఇప్పటికే ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం . ఇదీ ఆ కోవలోకి వచ్చే కార్యక్రమమే!
మేరీ మాటీ మేరా దేశ్ అంటే నా మట్టి, నా దేశం. ఈ కార్యక్రమం కింద ప్రధాని మోదీ .. దేశవ్యాప్తంగా లక్షల గ్రామ పంచాయతీల్లో.. అమర వీరుల పేర్లతో శిలా ఫలకాలు ఏర్పాటు చేయిస్తారు. అలాగే.. దేశం నలుమూలల నుంచి 7,500 కలశాల్లో మట్టి, మొక్కల్ని ఢిల్లీకి తెప్పించి.. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం దగ్గర అమృత వాటికను నిర్మిస్తారు.
దేశవ్యాప్తంగా గ్రామాల నుంచీ మట్టిని కలశాల్లో సేకరించడం..రాజధాని ఢిల్లీ లో స్మారక స్థూపం లో కలపడం ద్వారా… అమరవీరులకు అది చరిత్రాత్మక నివాళి అవుతుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అయితే.. ఈ మట్టిని ఎలా సేకరిస్తారు? కలశాలు కేంద్రమే ఇస్తుందా , కలశాల రవాణా వంటి విధి విధానాలు తెలియాల్సి వుంది .
ఈ కలశాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కొత్త కాదు .. గతం లో అనుభవమే .. అమరావతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్వయంగా తెచ్చిన బహుమతి – పార్లమెంటు నుండి మట్టి, యమునా నుండి నీరు (ఇది బోనస్) సేకరించి రాజధానికి శంకుస్థాపన (22-oct -2015) చేసిన సమయంలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ప్రధాని మోదీ మట్టి, నీటిని తో స్వయంగా పూజలో పాల్గొన్నారు .
అమరావతి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 16,000 గ్రామాల నుండి మట్టి మరియు నీటిని మరియు భారతదేశం మరియు విదేశాలలో అన్ని మతాలకు చెందిన పవిత్ర స్థలాల నుండి నీటిని తీసుకువచ్చింది. 2019 లో ప్రభుత్వం మారిన తర్వాత అమరావతి కి పట్టిన దుస్థితి , గత పార్లమెంటు కు పట్టి దుస్థితే నిదర్శనం . గత పార్లమెంట్ భవనం నుండీ మట్టిని శ్రీ నరేంద్ర మోడీ తెచ్చారు . నేడు ఆ పార్లమెంట్ భవనం లేదు . పాత పార్లమెంట్ భవనం మ్యూజియంగా మార్చబడుతుంది. వారసత్వ పునరుద్ధరణ కోసం వేచి చూస్తోంది . మన అమరావతి కధ అందుకు భిన్నం కాదు కదా … మేరా భారత్ మహాన్ … ఉందిలే మంచి కాలం ముందు ముందు నా … అందరూ సుఖపడాలి నంద నందనా ..