మెగా గ్రేటర్ హైదరాబాద్
రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ విస్తరణ కార్యక్రమం షురూ చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,సరికొత్త గ్రేటర్ హైదరాబాద్ ,సిటీ కార్పొరేషన్ దిశగా అడుగులేస్తోంది ,రేవంత్ సర్కార్ . హైదరాబాద్ సిటీ శివారు ప్రాంతాల్లోని కార్పొరేషన్లను , మున్సిపాల్టీలను విలీనం చేయాలని చూస్తోంది రేవంత్ సర్కార్ . ఇది కనుక జరిగితే సిటీ విస్తరణలో భాగంగా దేశంలోనే అతిపెద్దదిగా, మహా నగరంగ మారుతుంది హైదరాబాద్ . ఈ ప్రతిపాదనపై పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి .
హైదరాబాద్ మహానగరాన్ని మరింత విస్తరించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై కసరత్తు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. 7 కార్పొరేషన్లు, 30 మున్సిపాల్టీలను విలీనం చేసే అవకాశం స్పష్టముగా కనిపిస్తోంది. అన్నింటినీ కలిపి గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. లేదంటే నాలుగు కార్పొరేషన్లుగా కూడా విభజన చేసే అవకాశం ఉంది . ఈ ప్రక్రియ మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల పదవీ కాలం ముగిసిన తర్వాతే విలీనము మొదలయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం . పదవీకాలం ముగిసిన వెంటనే స్పెషల్ అధికారులను నియమించనున్నారు అని సమాచారం. వచ్చే సంవత్సరం 2025 లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు ఇతర పౌర సంస్థలకు కలిపి ఎన్నికలు జరగనున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పట్టణ సముదాయం 625 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో 7,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. హెచ్‌ఎండీఏ పరిధిలో , పీర్జాదిగూడ, బండ్లగూడ జాగీర్, జవహర్‌నగర్,బడంగ్ పెట్ , మీర్‌పేట్, నిజాంపేట్ ,బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. GHMC పరిధిలో , తెల్లాపూర్ మణికొండ, నార్సింగి లాంటి 30 మున్సిపాలిటీలు ఉన్నాయి. కొత్త గ్రేటర్ సిటీ కార్పొరేషన్ ఏర్పడ్డాక భౌగోళిక విస్తరణ లో దేశంలోనే అతిపెద్దదిగా హైదరాబాద్ విస్తరిస్తుంది .ఈ ప్రతిపాదనపై పనిచేయాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అధికారులను ని సీఎం, రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. వివిధ మహా నగరాల నమూనాలను, అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ అధికారులకు చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి .
నిజం చెప్పాలి అంటే హైదరాబాద్ సిటీ ప్రాంతంలో అన్నిరకాల ప్రధాన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. వీటి కోసం ఎక్కువ నిధులు ఖర్చు చేయవలసిన అవసరం లేదు. కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు మౌలిక సదుపాయాలను పెంచడానికి మాత్రం అత్యవసర నిధులు అవసరమని రేవంత్ సర్కార్ ఆలోచిస్తుంది . హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అధారిటీ ని అవుటర్ రింగ్ రోడ్ మరియు హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ వరకు విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు విశ్వసనీయ సమాచారం.ఏది ఏమైనా మెగా హైదరాబాద్ విస్తీర్ణకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న సంచలన నిర్ణయానికి తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారు