మంచు మనోజ్ .. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు రెండవ కుమారుడు రాజాకీయ రంగ ప్రవేశం చెయ్యడానికి అన్ని సిద్ధం చేసుకొంటున్నారు ఈ పనిలో భాగం గా నేడు తన సతీమణి మౌనికా రెడ్డి తో కలసి తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు ను కలవడం జరిగింది . ఇది సహజం గానే ఆసక్తిని కలిగించే అంశమే . మంచు మనోజ్ భార్య మౌనికా రెడ్డి ఎవరో కాదు తెదేపా తో సుదీర్ఘ ప్రయాణం చేసిన భూమా దంపతుల రెండవ కుమార్తె .
సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన మౌనికా మనోజ్ దంపతులు సుమారు అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీ రాజకీయాలతో పాటు పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. నందమూరి బాలకృష్ణ తో మంచి అనుభందం కూడా మంచు మనోజ్ కి వుంది .
ఎందుకు భేటీ కావాల్సి వచ్చింది..? అనే విషయాలపై ఇరు వైపులా నుండీ ఎటువంటి ప్రకటన రాలేదు. కానీ.. మనోజ్ మీడియాతో మాట్లాడుతూచేసిన వ్యాఖ్యలు ఆసక్తికరం గా మారాయి . దీంతో పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్లు గా తెలుస్తోంది . ‘ పెళ్లయిన తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు గారిని కలవడానికి వచ్చాము. రేపు మా బాబు పుట్టినరోజు ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. పొలిటికల్ ఎంట్రీపై త్వరలో నిర్ణయం ఉంటుంది’ అని మనోజ్ అన్నారు. ఇక మౌనిక రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు గారిని ను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. పెళ్లయిన తర్వాత ఎప్పటినుంచో కలవాలని అనుకున్నాం కానీ వీలు కాలేదు.. ఇవాళ కుదరిందన్నారు. మౌనిక రెడ్డి నంద్యాల , ఆళ్లగడ్డ లలో చురుకుగా పనిచేసేవారిని తెలుస్తోంది . ఈ రెండిటిలో ఏదో ఒక నియోజకవర్గం నుంచే పోటీ చేసే ఆసక్తి మౌనిక కు ఉన్నట్లు సమాచారం .