Gannavaram: వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మరియు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపైటీడీపీ యువనేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్ర గన్నవరంలోజన హోరు మధ్య సాగుతోంది . కార్యకర్తలు , అభిమానులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి లోకేష్‌కు తెలుగుదేశం శ్రేణులు ఘన స్వాగతం పలికారు. యువగళానికి ఎమ్మెల్యే వంశీ భయపడి పోలీసుల చాటున దాక్కున్నాడoటూ తెదేపా శ్రేణుల నినాదాలు చేశారు. గన్నవరం రహదారి మీదుగా రావాలంటూ శ్రేణుల పట్టు పట్టి , గన్నవరం ఊళ్లోకి మళ్లించారు. గన్నవరం సెంటర్ లో స్టూల్ పై నిల్చుని లోకేష్ ప్రజలకు అభివాదం చేశారు. లోకేష్ వెంట యార్లగడ్డ వెంకట్రావు ఉన్నారు. గన్నవరం గడ్డ తెలుగుదేశం అడ్డ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్రను తెలుగుదేశం శ్రేణులు కొనసాగించారు. ఐటీ శాఖా మంత్రిగా రాష్ట్రానికి హెచ్‌సీఎల్ కంపెనీని తానే తెచ్చానంటూ నారా లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు
Nara Lokesh Twitter : చేపలదుకాణాలు, మాంసం కొట్లు కాదు… అసలుసిసలైన అభివృద్ధి అంటే ఇదీ జగన్! ఇది కృష్ణాజిల్లా గన్నవరం సమీపంలోని కేసరపల్లి వద్ద 2018లో నేను ఐటి మంత్రిగా ఉన్నపుడు తెచ్చిన హెచ్ సిఎల్ సాఫ్ట్ వేర్ కంపెనీ. రూ.750 కోట్లతో ఏర్పాటైన ఈ సంస్థ 10వేలమందికి ఉద్యోగాలు కల్పించే సామర్థ్యంతో ఏర్పాటైంది. జగన్ మాదిరి మేం చదువుకున్న యువతతో చేపలదుకాణాలు, మటన్ మార్టులు పెట్టించలేదు, గంజాయి బానిసలుగా మార్చి మత్తులో ముంచలేదు. రాష్ట్రంలో వేలాదిమందికి ఉపాధి కల్పించే పరిశ్రమలను జె-ట్యాక్స్ కోసం పక్కరాష్ట్రాలకు తరిమేయలేదు. అభివృద్ధికి బ్రాండ్ చంద్రబాబుగారైతే, అరాచకానికి, విధ్వంసానికి కేరాఫ్ జగన్మోహన్ రెడ్డి!
ఉదయం క్యాంపు సైట్ వద్ద యార్లగడ్డ వెంకటరావు కు నారా లోకేష్ కండువా కప్పి తెదేపా లోకి ఆహ్వానం పలికారు .