Thursday, January 23, 2025
spot_img
HomeElections 2023-2024ఎన్నికల ముందు మరో బాంబ్ పేల్చిన మల్లారెడ్డి షాక్ లో బిఆర్ఎస్

ఎన్నికల ముందు మరో బాంబ్ పేల్చిన మల్లారెడ్డి షాక్ లో బిఆర్ఎస్

బారాసాకు నిరాశ మిగిల్చిన.. అసెంబ్లీ ఎన్నికలు
లోక్ సభ ఎన్నికల్లో.. కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా
కమలంతో.. కారు పొత్తు పొడిచేనా
సీఎం రేవంత్ సీటు పై మల్లారెడ్డి కొడుకు ఫోకస్
అదే జరుగుతే.. కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి చేరేనా
ఇప్పటికే కెసిఆర్ హ్యాండిచ్చి.. హస్తంతో దోస్తీ చేస్తున్న నేతలు
ఎంపీ ఎన్నికల ముందు.. మరో బాంబ్ పేల్చిన మల్లారెడ్డి

తెలంగాణలో శాసనసభ ఎన్నికల ముగిసాయి ఆ ఫలితాల్లో హస్తం విజయంతో, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ పగ్గాలను చేజిక్కించుకుంది. ఎవరు ఊహించని రీతిలో తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించారు. దీని నుండి కెసిఆర్ కోలుకోక ముందే తెలంగాణాలో పార్లమెంట్ ఎన్నికల ముందు షాకింగ్ న్యూస్ చెప్పి మళ్లీ రచ్చలేపిన మల్లారెడ్డి. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమే టార్గెట్ గా బీజేపీతో బిఆర్ఎస్ పొత్తు ఉండనున్నట్లు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మరో బిగ్ బాంబ్ పేల్చారు. అసెంబ్లీ లాబీలో మీడియాతో జరిగిన సమావేశంలో సంచలన విషయాలు బయట పెట్టారు. బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని మల్లారెడ్డి అన్నారు. బీజేపీతో పొత్తులో భాగంగా మల్కాజ్‌గిరి ఎంపీ టికెట్‌ నా కుమారుడు భద్రారెడ్డికి హామీ ఇచ్చారని అన్నారు . మల్లారెడ్డి చేసిన హాట్ కామెంట్స్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏ పార్టీతో కలిసే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు అందరు బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతారని చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఓటమి తర్వాత గతంలో మల్లారెడ్డి రాష్టంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయ భవిష్యత్ ఉండకపోవచ్చంటూ బాంబ్ పేల్చారు. త్వరలో కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎంపీ వెళ్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. చేవెళ్ల కాంగ్రెస్‌ ఎంపీ టికెట్‌ కోసం రంజిత్‌రెడ్డి పయత్నిస్తున్నారని ఆరోపించారు. రంజిత్‌రెడ్డి ప్రయత్నాలను పసిగట్టి పట్నం మహేందర్‌ రెడ్డి ముందుగానే మేల్కొన్నాడని అన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్‌ కోసమే పట్నం మహేందర్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారని, ఈ క్రమంలోనే తన సతీమణి శుక్రవారం కాంగ్రెస్ కండువా కప్పుకుందని తెలిపారు.

తాజా పరిస్థితుల్లో
తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది ఎవరు ఊహించని విదంగా ఉందన్నారు. ఎవరు ఏ పార్టీకి ఎప్పుడు హ్యాండిస్తారో అంతుచిక్కటం లేదని అన్నారు. మల్లారెడ్డి చేసిన కామెంట్స్ పై ఎంపీ రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి స్పందించకపోవడంతో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో అనేక చర్చలకు దారి తీస్తోంది అని విశ్లేషకులు అంటున్నారు. ఇదంతా చూస్తుంటే మల్లా రెడ్డి కూడా హస్తం బాట పట్టనున్నట్లు ప్రచారం జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బారాసాకు నిరాశ మిగిల్చినప్పటికీ.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం కుంగిపోకుండా రాబోయే లోక్ సభ ఎన్నికలపై కసరత్తులు రచిస్తోంది. ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపిక పై వ్యూహాలు రచిస్తోంది. ఐతే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నా కుమారుడు భద్రారెడ్డి మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాడని అన్నారు. గులాబీ దళపతి కేసీఆర్ కూడా నా కుమారుడికి ఎంపీ టికెట్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారని అన్నారు. ఒక వేళ నా కొడుక్కి మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇవ్వకుంటే.. మల్లా రెడ్డి కారు దిగి హస్తం తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో రేవంత్ రెడ్డి పై మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. రేవంత్ తో మల్లి కాకకు పాత స్నేహం ఉంది కనుక ఆయన తనయుడికి కెసిఆర్ హ్యాండిస్తే.. మల్లారెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటే తన వారసుడికి కాంగ్రెస్ నాయకత్వం మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశంలేకపోలేదు. సో.. కెసిఆర్ నిర్ణయంతో కారు ఇక షెడ్డుకే పరిమితమైతే మల్లారెడ్డి రేవంత్ గూటికి చేరే ఛాన్స్ మెండుగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి దీని పై ఓ క్లారిటీ రావాలంటే బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments