Saturday, September 7, 2024
spot_img
HomeNewsAndhra Pradeshకొడాలి నాని పై గుడివాడ లో చిరు అభి మానులు .. సై ..2024 లో...

కొడాలి నాని పై గుడివాడ లో చిరు అభి మానులు .. సై ..2024 లో పకోడీ ఎవరో తేలుస్తాం

Chiru Fans Fire Kodali Nani in Gudivada: మెగాస్టార్ చిరంజీవిపై మాజీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై చిరు అభినానులు రాష్ట్ర వ్యాప్తం గా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక గుడివాడలో బుధవారం చిరంజీవి అభిమానుల ఆందోళనకు దిగారు . ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ‘‘డౌన్ డౌన్ కొడాలి నాని… జై చిరంజీవ’’ అంటూ నినాదాలు చేస్తూ పట్టణ పురవీధుల్లో అభిమానులు నిరసన ర్యాలీ చేశారు. మెగాస్టార్ కు కొడాలి నాని క్షమాపణ చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. అయితే చిరంజీవి అభిమానుల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, చిరంజీవి అభిమానులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. చిరంజీవి యువత అధ్యక్షుడు కందుల రవి తో పాటు పలువురు అభిమానులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చిరంజీవి అభిమానులు.. పోలీసు వాహనాలకు అడ్డంగా పడుకున్నారు. ఈ క్రమంలో చిరంజీవి అభిమానులను పోలీసులు నియంత్రించలేని పరిస్థితులు నెలకొన్నాయి.

Valter Veeriah 200 days function

గుడివాడ ఏజీకే స్కూల్ వద్ద విజయవాడ ప్రధాన రహదారిపై చిరంజీవి అభిమానులు బైఠాయించి తమ నిరసన గళాన్ని వినిపించారు . శ్రీ వంగవీటి మోహనరంగా విగ్రహానికి క్షీరాభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా మెగా స్టార్ చిరు అభిమానులు మాట్లాడుతూ.. కొడాలి నాని పెద్ద చెకోడీ గాడు అంటూ ధ్వజమెత్తారు. చిరంజీవి, రంగా అభిమానుల ఓటుతో గెలిచిన కొడాలి నానికి 2024 ఎన్నికల్లో బుద్ధి చెబుతామని చిరంజీవి ఫ్యాన్స్ హెచ్చరించారు.

వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల వేడుక లో యాక్టర్ల రెమ్యూనరేషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీపై పడతారెందుకు?. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల‌ గురించి ఆలోచించాలి, పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయాలి’’. దీన్ని పాజిటివ్ దృక్పధం లో తీసుకోకుండా కొంతమంది వైకాపా నేతలు చిరు పై తమ స్థాయికి మించిన వ్యాఖ్యలు చేశారు . ఇక కోడలి నాని ఐతే ఒక అడుగు ముందుకు వేసి “సినీ ఇండస్ట్రీలో చాలా మంది పకోడిగాళ్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఎలా ఉండాలో పకోడిగాళ్ల సలహాలు తన వాళ్లకు ఇచ్చుకుంటే మంచిది అని హితవు పలికారు. రాజకీయాలు మనకెందుకు.. డ్యాన్స్‌లు, ఫైట్స్, యాక్షన్ గురించి ఆలోచించండని తన పకోడిగాళ్లకు సలహాలు ఇస్తే బాగుంటుందని కొడాలి నాని సూచించారు.” నాని వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీసాయి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Popular Categories

Recent Comments