రాజమండ్రి: నిన్న రాజమండ్రిలో జనసేన తెలుగుదేశం లకు చెందిన 12 మంది సమన్వయ కమిటీ సభ్యుల భేటీలో భవిష్యత్ కార్యాచరణ, ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలు, కలిసి ముందుకు సాగే అంశాలపై చర్చ. తెదేపా నుంచీ నారా లోకేష్ తో పాటుగా అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య, నిమ్మల రామానాయడు తో పితాని సత్యనారాయణ హాజరయ్యారు. ఇక జనసేన నుంచీ పవన్ కళ్యాణ్ తో పాటు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని, మహేంద్ర రెడ్డిలు పాల్గొన్నారు .
రాష్ట్ర వ్యాప్తం గా తెదేపా జనసేనలు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కలసి పని చేస్తున్నారు . దీన్ని మరింత విస్తృతం చేసే విధంగా వుమ్మడి జిల్లాల లో ఇరు పార్టీల అటుమీయ సమావేశాలు జరగాలని నిర్ణయుంచారు . ఈ సమావేశాలకు ఒక్కో పక్షం నుంచీ ముఖ్య నేతలు 50 మంది పాల్గొనే విధం గా ఏర్పాట్లు చేశారు .
భేటీ అనంతరం నారా లోకేష్ , జనసేనాని కలసి మీడియా తో మాట్లాడారు … జగనాసుర పాలన నుంచి విముక్తి కోసమే .. -జనసేన, టీడీపీ ల పొత్తు అన్నారు .
చంద్రబాబు విజన్ -2020 అంటే నేను ఏదో అనుకున్నాను. రాళ్ళు, రప్పలు వున్న ప్రాంతం చూసి ఇది ఎలా అభివృద్ధి చెందుతుంది అనుకున్నాను. కానీ మన కళ్ళ ముందు జరిగింది.. చంద్రబాబు విజన్ ఏమిటి అనేది అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం అవసరం. అనుభవం ఉన్న నాయకుడు అవసరం. చంద్రబాబు అరెస్టు చాలా బాధాకరం. మనం రాష్ట్రం కోసం పొత్తు పెట్టుకున్నాం.. చిన్న లోపం కూడా రాకూడదు. అందరం అప్రమత్తంగా ఉండాలి’ అన్నారు పవన్ కళ్యాణ్
- వీలైనంత వరకు రెండు పార్టీల మధ్య ఏ చిన్నపాటి గొడవ కూడా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడిన టీడీపీ-జనసేన జేఏసీ
- జిల్లా స్థాయిలో రెండు పార్టీల నుంచి చెరో 50 మంది సమావేశమై ఆత్మీయ కలయికలా సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం
- ఉమ్మడి జిల్లాల ప్రతిపాదికన సమన్వయ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం
- ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సమన్వయ సమావేశాలపై ఎక్కువ ఫోకస్ పెట్టాలనే అభిప్రాయానికి వచ్చిన జేఏసీ
- జిల్లా స్థాయిలో జరిగే సమావేశాలకు ఇరు పార్టీల నుంచి ఒక్కో సీనియర్ నేతను సమన్వయానికి పంపాలని నిర్ణయం
- టీడీపీ-జనసేన పార్టీల మధ్య ఏదో రకంగా గొడవలు పెట్టేందుకు వైసీపీ నిత్యం ప్రయత్నిస్తూనే ఉంటుందన్న పవన్ కళ్యాణ్
- సోషల్ మీడియా ద్వారా కులాల మధ్య క్లాష్ వచ్చేలా అధికార పార్టీ వ్యవహరిస్తుందని లోకేష్ ప్రస్తావన
- టీడీపీ-జనసేన పొత్తులపై వైసీపీ దూసే కత్తులను అధిగమించాల్సి ఉంటుందన్న నేతలు
- ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో రెండు పార్టీల కేడర్ కలిసిపోయి పని చేసుకుకుంటున్నారన్న నేతలు
- సమావేశంలో బీజేపీ అంశంపై ప్రస్తావన
- నేను ఎన్డీఏలో ఉన్నాననే విషయాన్ని ఇప్పటికే వివిధ సందర్భాల్లో చెప్పానన్న పవన్
- ఏపీ ప్రయోజనాల కోసం.. వైఎస్ జగన్‌కు వ్యతిరేకంగా చేయాల్సిన పోరాటం కోసం అత్యవసరంగా కలిశామన్న నేతలు